ఒకప్పుడు లగ్జరీ సింబర్.. ఇప్పుడు మూలపడిన వేస్ట్ మెటీరియల్.. కానీ వాడితే ఎన్ని లాభాలో

-

ఇప్పుడు బైక్ లేని ఇళ్లు లేదు.. చిన్నదో పెద్దదో ఏదో ఒక బైక్ అయితే అందరి ఇళ్లలో ఉంది. 20 ఏళ్ల వెనక్కు వెళ్తే.. ప్రతి ఇంట్లో సైకిల్ ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ మీదే ప్రయణం. సైకిల్ వచ్చిన మొదట్లో అది ఒక లగ్జరీ సింబల్ గా ఉండేది. సైకిల్ కు దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ రోజుల్లో కుటుంబసభ్యులను సైకిల్ మీద ఎక్కించుకుని సినిమాలకు, షికార్లకు కూడా వెళ్లేవారు. ఇలా డైలీ సైకిల్ తొక్కడం వారి జీవితంలో భాగం అయిపోయింది. వారికి తెలియకుండానే మంచి వ్యాయామం.. ఎలాంటి రోగాలు ఉండేవి కావు.

ఒకపక్క మారిన జీవన విధానం వల్ల శారీరక శ్రమ లోపించి మనుషులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇంధనంతో నడిచే వాహనాలను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తూ ఉండడంతో పర్యావరణానికి ముప్పు పెరుగుతూపోతుంది.. వాహనాల నుండి వస్తున్న కాలుష్యం వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి మనిషి జీవన విధానం అంతకంతకు దెబ్బతింటోంది.

ప్రపంచ దేశాలు..సైకిల్ వాడమని నాలుగు కిలోమీటర్ల లోపు వారి వారి కార్యాలయాలకు సైకిల్ పై వచ్చేలాగా ప్రోత్సహిస్తుంది. అంతే కాదు అలా వచ్చిన వారికి కొంత నగదు రూపంలో సహాయం కూడా ఇస్తున్నారు.. దానికి కారణం పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలలో చాలా దేశాలు ఈ పద్ధతులను పాటిస్తున్నాయి. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి కూడా లాభాలు ఉన్నాయని వైద్యులు ఎప్పుడూ అంటుంటారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ 19 ప్రత్యేకించి శ్వాస కోశానికి సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి లంగ్స్‌ని ఎటాక్ చేసి వాటి పని తీరుని దెబ్బతీస్తోంది. ఆరోగ్యంగా ఉన్న వారూ, కొవిడ్ సోకి రికవర్ అయిన వారూ కూడా ఊపిరి తిత్తులని బలంగా చేసే ఎక్సర్సైజెస్ చేయడం అవసరం. కొద్దిగా ఆయాసపడేలా చేసే ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా లంగ్స్‌కి మంచిదే. రోజూ ప్రాక్టీస్ చేస్తే, సైక్లింగ్ వల్ల గాఢంగా ఊపిరి పీల్చి వదిలే సామర్ధ్యం వస్తుంది. ఇది లంగ్స్ ఆరోగ్యానికి సహకరిస్తుంది.

కాబట్టి మూలపడిని సైకిల్ తీయండి.. అప్పుడప్పుడు తొక్కండి. గల్లిల్లో తిరగడానికి ఎంచక్కా సైకిల్ మీద వెళ్లండి.. మనీ సేవ్ అవుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే.. ఎక్కువ దూరం ఇప్పుడూ ఎవరూ సైకిల్ తొక్కలేరు. కానీ కాస్తదూరం అయితే సాధ్యమే కదా..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news