ఎన్నో కష్టాలు దాటుకుని ఉద్యమ స్ఫూర్తిని చాటుకుని గొప్ప సంకల్పంతో తెలంగాణ ఏర్పాటైంది. నేను మీ సీఎంను కేసీఆర్ ను మాట్లాడుతున్నాను అని చెప్పిన వేళ కు సార్థకత చేకూరింది. కొండపై దేవుడ్ని చూడాలి. ఒకప్పుడు కష్టాలు.. ఇప్పుడు హాయిగా వెళ్లిరండి.. ఆనందించాలి మీరు.. గొప్ప శిల్ప సంపదను పునః సృష్టి చేయాలన్న తపన కేసీఆర్ ది.. చలువ పందిళ్లలో స్వామి కల్యాణం.. నల్లరాతి నిర్మాణాల్లో స్వామి వైభోగం అన్నీ అన్నీ మరో ప్రభుత్వం చేస్తుందో లేదో కానీ కేసీఆర్ లాంటి దక్షత ఉన్న వారే ఇలాంటి యజ్ఞం చేయగలరు. కొండపై ఎంతో నాణ్యత కూడిన ప్రసాదం.. స్వామిని దర్శించుకుని వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ సేవలు..ఇలా ఎన్నో ! నగరానికి కాస్త దగ్గరగానే ఆధ్యాత్మిక వైభవం.. కనరో భాగ్యము.. వినరో భాగ్యము విష్ణు కథ అని పాడుకోండి.
కలలు ఎన్నో విధాలు
జీవితాన్ని అర్థం చేసుకునేలా కొన్ని
సార్థకం చేసుకునేలా కొన్ని
ఓ ప్రాంతం అభివృద్ధికి సహకరించే కల
ఉన్నత స్థాయిలో వైష్ణవ సంప్రదాయ రీతిని
ప్రపంచానికే చాటే కల.. నారసింహ రూపం లో
కోపమే కాదు జనులను కాచే శాంతం కూడా ఉంటుంది
కొండపై దేవుడు చల్లగా చూస్తాడు
మీరు వెళ్లండి మొక్కులు చెల్లించి రండి
స్వామి దీవెనలు అందుకోండి
పాలకుల సంకల్పాన్ని కూడా మెచ్చుకుని రండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల ఎట్టకేలకు సాకారం కానుంది. ఆయన అనుకున్న విధంగా శిల్ప కళా చాతుర్యం అంతా నల్ల రాతి నిర్మాణాలతో వెలుగులోకి వచ్చాయి. యాదాద్రి వేడుకలకు ముఖ్యమంత్రితో సహా పలువురు విచ్చేయనున్న అరుదైన సందర్భం ఇది. మరో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించే విధంగా నృసింహ స్వామి దేవాలయం రూపునూ రేఖనూ మార్చారు కేసీఆర్.
అందుకే ఈ ఆలయ విశిష్టతకు మరింత ప్రాభవం చేకూరింది. గతంలో మాదిరి కాకుండా యాదాద్రి పరిసర ప్రాంతాలను కూడా పచ్చందనాలు నింపారు. కొండమీదకు వెళ్లే మార్గాన్ని సుందరీకరించారు.ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలనూ పచ్చందనాలతో నింపారు. ఒక ముఖ్యమంత్రి తల్చుకుంటే ఏదయినా సాధ్యం అన్నంతగా ఎవ్వరూ ఊహించని విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
ఇదీ షెడ్యూల్ : మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ దంపతులు
- ఇవాళ (మార్చి 28,సోమవారం) ఉదయం 9.30 గంటలకు
బయలుదేరనున్నారు - బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో
వెళ్లనున్నారు - ఉదయం 11.55 గంటలకు జరిగే మహాకుంభ సంప్రోక్షణలో
పాల్గొననున్నారు - మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం,
స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన చేయనున్నారు. - మధ్యాహ్నం 12.20 నుండి 12.30 శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనం
చేసుకోనున్నారు. - యాదాద్రి ఆలయ పున ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకోనున్నారు.
Telangana is a holy land. Hon’ble #CMKCR Garu will inaugurate the magnificent Sri Lakshmi Narasimha #YadadriTemple today.
The #Yadadri 🛕🚩 Temple will be a landmark of spiritual and architectural journey. pic.twitter.com/4I8eXe5uok
— Harish Rao Thanneeru (@trsharish) March 28, 2022