ఇలా మీ బుగ్గల్ని అందంగా మార్చేసుకోండి… మరెంత అందంగా మారండి..!

-

ప్రతి ఒక్కరూ కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. మహిళలైతే అందంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా..? మరెంత అందంగా మారాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి. ఇలా చేయడం వలన బుగ్గలు ఎంతో అందంగా ఉంటాయి మీ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి అవుతుంది. గులాబీ రంగులో మెరిసే బుగ్గలని పొందడానికి చూస్తున్నట్లయితే ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి. గులాబీ రంగులో అందంగా మీ బుగ్గలు మారితే మీ అందం కూడా రెట్టింపు అవుతుంది.

మసాజ్ చేస్తే రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది బుగ్గలు సహజంగా రోజ్ కలర్ లోకి మారిపోతాయి ప్రతిరోజు వ్యాయామం చేయడం కూడా మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఎక్కువ మోతాదులో నీరు తాగడం కూడా ఎంతో ముఖ్యం. ఇలా తాగడం వలన చర్మం తాజాగా మారుతుంది. చర్మం బాగా మెరుస్తుంది ఆవిరి పడితే కూడా గులాబీ రంగులోకి బుగ్గలు మారుతాయి ఆవిరి పడితే చర్మ రంద్రాలు ఓపెన్ అవుతాయి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఫేస్ మాస్కులు కూడా బాగా పనిచేస్తాయి.

బుగ్గలు గులాబీ రంగులోకి మారుతాయి. రోజు వాటర్ తేనే పెరుగు ముఖానికి పటిస్తే గులాబీ రంగులోకి బుగ్గలు మారుతాయి. అంజీర్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంజీర్ ని ప్రతిరోజు తీసుకుంటే చర్మం మెరిసిపోతుంది. తాజాగా అందంగా స్కిన్ ఉంటుంది. బాదం కూడా చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషక పదార్థాలు మీ బుగ్గలని అందంగా మారుస్తాయి. పైగా ఆరోగ్యానికి మంచిదే. ఆపిల్ జ్యూస్ లో తేనె వేసుకుని తాగితే కూడా చర్మం ఎంతో అందంగా మారుతుంది. గులాబీ రంగులోకి బుగ్గలు వస్తాయి. బీట్రూట్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి అందానికి బాగా పనికొస్తుంది బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే రక్తప్రసరణ వ్యవస్థ బాగుంటుంది. పింక్ కలర్ లోకి మీ బుగ్గలు మారుతాయి ఇలా అందంగా మీ బుగ్గల్ని మార్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news