7 సీటర్​ మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా.. హైదరాబాద్‌లో ఆన్‌ రోడ్‌ ధర ఎంతంటే

-

ఇండియాలో ఆటోమొబైల్‌ మార్కెట్‌లో పోటీ గట్టిగా ఉంది. ఒకదాన్ని మించి ఒకటి వస్తున్నాయి. హ్యుందాయ్​ క్రేటా నుంచి టాటా నెక్సాన్​, కియా సెల్టోస్​ వరకు.. అనేక మోడల్స్​ మధ్య పోటీ విపరీతంగా కనిపిస్తోంది. అయితే వీటన్నింటినీ మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఢీకొట్టింది. సేల్స్​ పరంగా.. ఈ ఎస్​యూవీ దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీలో 7 సీటర్​ వర్షెన్​ని తీసుకొచ్చేందుకు సంస్థ ప్లాన్​ చేస్తోంది. ప్రస్తుతం వై17 రెండర్​గా టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఎస్​యూవీలో 7 సీటర్​ వర్షెన్​ని.. 2025 నాటికి మార్కెట్లోకి తీసుకు రావాలని సంస్థ చూస్తోంది. అంతేకాకుండా.. 6 సీటర్​ వర్షెన్​ కూడా వస్తుందని టాక్​ నడుస్తోంది.

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా..

7 సీటర్​ మారుతి సుజుకీ గ్రాండ్ విటారాని.. మొదట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో కంపెనీకి ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ 4 సిలిండర్​ కే 15 సీ మైల్డ్ హైబ్రీడ్ పెట్రోల్, 1.5-లీటర్ 3 సిలిండర్​ స్ట్రాంగ్ హైబ్రీడ్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. డిసెంబర్ 2023లో గ్రాండ్ విటారా 5 సీటర్​ ఎస్​యూవీకి చెందిన 6988 యూనిట్లను విక్రయించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.

ఆన్‌ రోడ్‌ హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ధర: కే 15సీ డ్యూయెల్ జెట్, డ్యూయెల్ వీవీటీ స్మార్ట్ హైబ్రీడ్ పెట్రోల్‌లో, మిడ్- వేరియంట్లలో లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్లలో టయోటా నుంచి తీసుకున్న శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్ ఉండొచ్చు. ముఖ్యంగా 7 సీటర్​ మారుతి సుజుకి గ్రాండ్ విటారాని.. టయోటా హైరైడర్​ ఆధారంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వై17 మోడల్​ మారుతీ సుజుకీకి చెందిన అతిపెద్ద ఐసీఈ ఎస్​యూవీగా నిలుస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .15 లక్షల కన్నా ఎక్కువే ఉండొచ్చని టాక్. ఇది టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్, సిట్రోయెన్ సీ3 ఎయిర్​క్రాస్​, మహీంద్రా ఎక్స్​యూవీ 700, హ్యుందాయ్ అల్కజార్, త్వరలో లాంచ్​కానున్న రెనాల్ట్ డస్టర్ వంటి మోడల్స్​తో పోటీపడనుంది.

డిజైన్​ పరంగా చూసుకుంటే.. 7 సీటర్​ ఎస్​యూవీకి, ప్రస్తుతం ఉన్న మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాకు పెద్దగా తేడాలు లేనట్లే ఉంది. కానీ పొడవు కాస్త ఎక్కువ ఉండొచ్చు. సుజుకీ బ్యాడ్జీలతో కూడిన క్రోమ్ బార్, బ్లాక్ హెక్సాగోనల్ గ్రిల్ సెక్షన్, షార్ప్​ ట్రిపుల్ బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, వర్టికల్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, వెడల్పాటి తక్కువ ఎయిర్ ఇన్టేక్, కండరాల బానెట్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ కొత్త డిజైన్​తో పెద్ద చక్రాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news