బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు గాయం..!

-

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పర్యటనలో భాగంగా బుర్వాన్ నుంచి కోల్ కతాకు తిరిగి వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె కారులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ తరుణంలో అకస్మాత్తుగా కారు ప్రమాదం సంభవించింది.

వాతావరణం అంతగా సహకరించకపోవడంతో మమతా బెనర్జీ కారులో బుర్వాన్ నుంచి కలకత్తాకు తిరిగి వస్తుండగా.. ఆమె ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ కి ఎదురుగా అకస్మాత్తుగా మరో కారు వచ్చింది. దీంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. దీదీ తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను కోల్ కతాకు తీసుకువస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది ఇలా ఉంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి కి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్  ఇచ్చింది. వచ్చే లోక్ సభ  ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో ఒంటరి గానే పోటీ చేయబోతున్నామని వెల్లడించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news