వండర్ కిడ్.. 11 ఏళ్లకే ఇంజినీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు..!

-

వీడు మామూలు కిడ్ కాదు బాబోయ్. వండర్ కిడ్. పేరు మహమ్మద్ హసన్ అలీ. వయసు 11 ఏళ్లు. ఊరు హైదరాబాద్. చదివేది ఏడో తరగతి. కానీ తెలివి యువకులకంటే ఎక్కువ. అందుకే బీటెక్, ఎంటెక్ చదివే విద్యార్థులకు కూడా అలవోకగా పాఠాలు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మనోడు 30 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు ట్యూషన్ కూడా చెబుతున్నాడు. నమ్మశక్యంగా లేదు కదా.. కాని నమ్మాల్సిందే డ్యూడ్…

ఇంజినీరింగ్ విద్యార్థులకు అలీ ఉచితంగానే క్లాసులు చెబుతున్నాడట. 2020 వరకు వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పడమే తన ధ్యేయమట. అందరు పిల్లల్లాగానే మనోడు రోజూ స్కూల్ కు వెళ్తాడు. ఆటలు ఆడుతాడు. చదువుకుంటాడు. ఇంటికొచ్చిన తర్వాత సాయంత్రం ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు క్లాసులు చెబుతాడు. మనోడికి డిజైనింగ్ అంటే ఇష్టమట. అందుకే డిజైనింగ్, డ్రాఫ్టింగ్ గురించి లోతుగా నేర్చుకొని దాన్నే స్టూడెంట్స్ కు చెబుతాడట. ఇనిస్టిట్యూట్స్ కు వెళ్లి సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ కు మనోడు పాఠాలు చెబుతాడట.

చాలామంది నేటి ఇంజినీర్లకు టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. అందుకే.. సరైన జాబ్స్ దొరకక.. దొరికిన దాంతో ఇంజినీర్లు సంతోష పడుతున్నారు. పేపర్లు, వీడియోల్లో చాలాసార్లు చూశా. అందుకే.. నాకు ఆసక్తిగా ఉన్న డిజైనింగ్ ను ఇప్పటి నుంచే నేర్చుకోవడం ప్రారంభించా.. దాంతో పాటు వాళ్లకు కూడా నేర్పిస్తున్నా. ఓ సంవత్సరం నుంచి పాఠాలు చెప్పడం ప్రారంభించా. నేను ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ఇంటర్నెటే నా సోర్స్ ఆఫ్ లర్నింగ్. ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. అది ఏదో ఒక సర్వీస్. అందుకే నా దగ్గరకి వచ్చే 30 మంది స్టూడెంట్స్ కు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాను.. అంటూ పెద్ద మనసుతో చెప్పాడు బుడ్డోడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version