నిద్రలో తన పురుషాంగాన్నే కట్‌ చేసుకున్నాడు.. ఎందుకంటే..!

నిద్రలో నడవడం, అరవడం ఎవరైనా చేస్తారు.. కానీ ఓ వ్యక్తి నిద్రలో ఏకంగా తన పురుషాంగాన్నే కట్‌ చేసుకున్నాడు. ఎందుకు అలా చేశాడో తెలిస్తే..మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఘనాకు చెందిన కోఫి అట్టా అనే రైతుకు నాన్ వేజ్ అంటే చాలా ఇష్టం.. అతనికి మటన్ తినాలనిపించింది. ఇందుకోసం ఆగస్టు 12న ఎలాగైన తన భార్యతో మటన్‌ను వండించుకుని తినాలనుకున్నాడు. అలానే నిద్రలోనికి జారుకున్నాడు. అయితే, కోఫి అట్టా కలలో తన ఇంటికి మేకను తీసుకొచ్చినట్లు భావించాడు. తనముందు నిలబడి ఉన్నట్లు అనుకున్నాడు. అంతే కాకుండా.. నిద్ర మత్తులోనే ఒక కత్తికూడా పట్టుకున్నాడు. తన పురుషాంగాన్ని మేక తలకాయలా అనుకోని.. మనోడు నిద్రలోనే పురుషాంగాన్ని పట్టుకుని కత్తితో కట్ చేసేశాడు.
ఇంతలో నొప్పిగా అనిపించడంతో నిద్ర నుంచి తేరుకున్నాడు. పురుషాంగం నుంచి రక్తం కారుతుంది. దీంతో అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అతడిని ఘనా సెంట్రల్ రీజియన్‌లోని ఆస్పత్రికి తరలించారు. వైద్యుల అతనికి టెస్ట్‌ చేశారు. తాను.. నిద్రలో ఈ పనిచేశానని, కుర్చీలో కూర్చొని ఉండగా మేక అనుకుని, తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నట్లు కోపీ డాక్టర్లకు తెలిపాడు. అతడిని చికిత్స అందించిన తర్వాత వైద్యులు డైపర్‌ను తొడిగారు.
మొత్తానికి సరైన టైంలో చికిత్స అందిచడం వల్ల అతనికి ప్రాణాపాయం మాత్రం తప్పింది. దీంతో అతడిని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. అయితే డైపర్ వేసుకోవడంతో.. ఇరుగుపొరుగు వారు అతడిని వింతగా చూస్తున్నారు. దాంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. విషయం తెలిసిన నెటిజన్లు.. ఇదేందిరా నాయనా.. కలలో ఇలాంటి పనులు కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.
నిద్రలో చాలామంది.. నడుస్తూ ఎక్కడికో వెళ్లిపోతారు.. కొన్నిసార్లు ఇంట్లోంచి బయటకు కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ప్రమాదాలు జరగొచ్చు. ఏది ఏమైనా నిద్రలో ఇలా నడిచే వాళ్లు, తెలియకుండా ఇలాంటి పనులు చేసే వాళ్లు కాస్త జాగ్రత్తగానే ఉండాలి.