ఇకపై సెల్‌ఫోన్‌ కొంటే చార్జర్‌ ఇవ్వరంటా..?

-

కొత్త సెల్‌ఫోన్‌ కొంటే దాంతో పాటు చార్జర్, హెడ్‌సెట్‌ ఉచితంగానే ఇస్తారు. ఇకపై ఎలాంటి కంపెనీ ఫోన్లు కొన్నా చార్జర్‌ కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే. పన్ను పెరిగిన స్థాయిలాగా సెల్‌ఫోన్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లపై అధిక ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు బడ్జెట్‌ ఫోన్లను తక్కువ లాభాలు అర్జిస్తూ ఆయా కంపెనీలు అమ్మేవారు.

అయితే.. పన్ను భారాన్ని మోసే స్థాయిలో వీటి తయారీ కంపెనీలు లేకపోవడంతో వినియోగదారులపైనే భారం పడబోతుంది. దీంతో ఇకపై చార్జర్లు లేకుండానే సెల్‌ఫోన్లు విక్రయించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు టెక్నోవిజన్‌ ఎండీ సికందర్‌ పేర్కొన్నారు. అనేక సంస్థలు చార్జర్లను స్థానికంగా తయారు చేస్తున్నాయి. స్వల్పంగా ధరలు పెరిగినా ఫోన్ల అమ్మకాలు తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు అశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రతిపాదనలకు విరుద్ధంగా..

సెల్‌ఫోన్‌ మొక్క వివిధ భాగాలు, చార్జర్ల తయారు చేయాడానికి కావాల్సిన పలు పరికరాలపై సుంకం విధించడాన్ని ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ వ్యతిరేకిస్తోంది. తమ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ ఆరోపించారు. చార్జర్ల తయారీకి ఉపయోగించే కొన్ని పరికరాలపై 2.5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు.

చార్జర్లపై 10 శాతం సుంకం..

మదర్‌బోర్డ్‌గా పిలిచే ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ అసెంబ్లీ (పీసీబీఏ), కెమెరా మాడ్యూల్స్, కనెక్టర్స్, వైర్డ్‌ హెడ్‌ సెట్స్, యూఎస్‌బీ కేబుల్, మైక్రోఫోన్, రిసీవర్లపైనా 2.5శాతం కస్టమ్స్‌ డ్యూటీ విధించారు. మొబైల్‌ చార్జర్లపై ఏకంగా 10 శాతం దిగుమతి సుంకం ప్రకటించారు. చార్జర్‌ మరియు అడాప్టర్ల తయారీకి ఉపయోగించే మౌల్డెడ్‌ ప్లాస్టిక్‌ ముడి పదార్థాలు, విడిభాగాలపై కూడా 10 శాతం సుంకం వసూలు చేయనున్నారు. చార్జర్లు, మొబైల్‌ ఫోన్‌ విడిభాగాలపై నేటి నుంచి, మిగిలినవాటిపై ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news