నదిలో ఆమె ఆకారం.. రాత్రుళ్లు ఏడుస్తూ వింత శబ్ధాలు.. కథలుకథలుగా చెప్పుకుంటున్న జనం..!

-

ఈ భూ ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అడపాదడపా వాటిగురించి వార్తల్లో మనం చూస్తుంటాం. శాస్త్రవేత్తలు బుర్రలకు కూడా అందని ఎన్నో చిత్రవిచిత్రాలు ఇప్పటికీ అలానే మిగిలిపోయాయి. అలాంటి వాటిల్లో ఒకటే ఈ ల్లోరోనా. ఈ పదానికి స్పెయిన్ భాషలో ఏడ్చే మహిళ అని అర్థం. ఇప్పుడు ఈ మిస్టరీ వింటే..మీకు ఒకపక్క ఆసక్తి కలగినా..మరో పక్క భయం కూడా వేస్తుంది. రీల్ కథను మిరిపించే రియల్ స్టోరీ ఇది. ఇంకేందుకు ఆలస్యం ఆ వివరాలు ఏంటి ఇప్పుడు చేసేద్దాం.

మెక్సికోలో ఆమె కథను అక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. తరాలుగా ఈ కథ ఒకరి నుంచి మరొకరికి చేరుతూ వస్తోంది. ఈ కథను ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతుంటారు. అయితే అన్నింటిలో కామన్ పాయింట్ ఏంటంటే.. ఓ మహిళ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. పొడవాటి నల్లటి జుట్టుతో మెరుస్తూ ఉంటుంది. శాంటా ఫె నది పక్కన, సరస్సుల పక్కన ఆమె రాత్రివేళ నడుస్తూ కనిపిస్తుందట. తన పిల్లల కోసం ఆమె వెతుక్కుంటూ ఉంటుంది. అరుస్తుంది, ఏడుస్తుంది, శపిస్తుందట… ఇది అక్కడి ప్రజలు చెప్పుకునే కథలో సారాంశం. ఇది ఎంతో ఆసక్తిగా ఉండటంతో చరిత్రకారులు సైతం ఫోకస్ పెడుతున్నారట..

ఆమె పేరు మారియా. ఓ పేద కుటుంబంలో పుట్టింది. చాలా అందంగా ఉంటుంది. ఆమె వీధిలో వెళ్తుంటే దేవకన్యలా కనిపించేదట. ఆమెను చూసేందుకు చాలా మంది ఆ వీధిలో పనీపాటా లేకుండా తిరిగేవాళ్లట. ఈ క్రమంలోనే ఆమె యుక్త వయసుకు వచ్చింది. ఆ ప్రశంసలు నచ్చాయి. ఏ అమ్మాయైనా అందంగా ఉన్నావని ఎవరైనా అంటే లోలోపల ఎక్కడలేని సంతోషం ఉంటుంది కదా. ఆమె కూడా చాలా సంతోషించేది. అలాంటి పొగడ్తల కోసం… ఇంట్లోంచీ ఏదో ఒక వంకతో బయటకు వచ్చి… తెల్లటి గౌనుతో వీధిలో అలా తిరిగేది. ఆమె అలా వెళ్తుంటే… కుర్రాళ్లు పడిచచ్చేవాళ్లు. ఇవన్నీ ఆమె జీవితంలో ఆనందకరమైన రోజులు.

గుర్రం మీద వచ్చాడా వ్యక్తి

అలా జరుగుతున్న మారియా లైఫ్ లోకి ఓ రోజు గుర్రంపై వెళ్తూ ఓ వ్యక్తి ఆమెను చూశాడు. ప్రేమ అన్నాడు.. నిజమని నమ్మింది. అత్యంత సంపన్నుడైన అతను ఆ మరుసటి రోజే.. ఆమె ఇంట్లో వాలిపోయాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. పెళ్లైపోయింది. మొదట్లో ఆమెతో బాగానే ఉన్నాడు. ఇద్దరు అబ్బాయిలు పుట్టాక అతని వైఖరి మారింది. క్రమంగా ఆమెను మెచ్చుకోవడం మానేశాడు. నువ్వు ఇదివరకంత అందంగా ఏమీ లేవు అంటూ రుసరుసలాడటం ప్రారంభించాడట. మారియా అందం ఎప్పూడు ఒకేలా ఉండదు కదా.. అంటే “నాకు అదంతా అనవసరం… నువ్వు ఇదివరకట్లా ఉండాల్సిందే” అనేవాడట ఆ భర్త. దాంతో ఆమెకు ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు.

అసలు విషయం ఇదా

క్రమంగా మూడు నాలుగు రోజులకోసారి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఎందుకీ మార్పు అని మారియా ఆరా తీసింది. అప్పుడామెకు అసలు విషయం తెలిసింది. అతనికి ఆడవాళ్ల పిచ్చి. ఎవరితోనూ శాశ్వతంగా ఉండడట. అమ్మాయిలతో గడిపే అలవాటు కూడా ఉందట. డబ్బు ఎరవేసి.. అమ్మాయిలను ఆటబొమ్మల్లా చూసేవాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా… తన ఇద్దరి పిల్లల్ని తప్ప మారియాను పట్టించుకునేవాడు కాదు. ఇదంతా చూస్తూ… తట్టుకోలేకపోయిన మారియా… ఆ పిల్లలపై పగ పెంచుకొని వారిని నదిలో ముంచి చంపేసి… తను కూడా సూసైడ్ చేసుకుంది అనేది ఈ కథలో ఒక కోణం మాత్రమే.

పడేశాక రియలైజేషన్.

మరో కోణం ఏంటంటే భర్తపై పగతో పిల్లల్ని నదిలో ముంచిన మారియా వాళ్లు అమ్మా అమ్మా అంటూ విలవిలలాడుతుంటే ఆమె మనసు కరిగిపోయింది. మాతృహృదయం తల్లడిల్లి.. వెంటనే పిల్లల్ని నీటి లోంచీ తీద్దామని ప్రయత్నించింది. కానీ… నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఆ పిల్లలు కనిపించకుండా పోయారు. దాంతో వారి కోసం అక్కడే వెతుకుతూ వెతుకుతూ… తిండి తినేది కాదు. రోజులు గడిచేకొద్దీ ఆమె జీవచ్చవంలా మారింది. చివరకు అలాగే చనిపోయిందట. అలా ఆత్మగా మారి ఈరోజికి వారి కోసం అక్కడ వెతుకుతూ కనిపిస్తుందనేది ఈ కథలో మరో కోణం. అందుకే ఆమెపై అక్కడివారికి ఓరకమైన జాలి ఉంటుంది.

హర్రర్ యాంగిల్ కూడా

ఈ స్టోరీలో మనం ఇప్పటివరకూ సెంటిమెంట్ కోణం మాత్రమే చూశాం కదా… ఇక ఇప్పుడు హర్రర్ కోణం కూడా ఉంది.. తన పిల్లలు తనకు దూరమవ్వడం, తన జీవితం అల్లకల్లోలం అవ్వడంతో మారియా ప్రేతాత్మలా మారింది. ఇక అప్పటి నుంచి నదులు, సరస్సుల దగ్గర తిరుగుతూ అప్పుడప్పుడూ నీటిలో కూడా కనిపిస్తూ ప్రజలను భయపెట్టేదట. ఆమె ఆత్మకు శాంతి లేదు. అప్పుడప్పుడూ రాత్రివేళ ఆమె ఏడుస్తుంది… ఆ తర్వాత భయంకరంగా అరుస్తుంది. ఆమెను రాత్రివేళ చూస్తే ప్రమాదం అనీ… పగబట్టే ఛాన్స్ ఉందనే ప్రచారం జరగడంతో… ఇక మెక్సికోలో ప్రజలు రాత్రి వేళ నదులు, సరస్సుల దగ్గరకు వెళ్లట్లేదు అనేది మరో కోణం. ఆమె ఏడుపు విన్నా దురదృష్టం తప్పదనీ… ప్రాణాలు పోతాయని స్థానికులు నమ్ముతుంటారు.

ఇలా వాడేస్తున్నారేంట్రా.!.

ఇప్పుడు ఈ కథను పిల్లలకు తల్లిదండ్రులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎలాగంటే స్కూళ్లకు పంపే పిల్లలు సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయాలనే ఉద్దేశంతో… వారికి ఈ కథ చెబుతున్నారు. దాంతో పిల్లలు రాత్రి అవ్వక ముందే ఇళ్లకు వస్తున్నారు. అలా మెక్సికోలో పేరెంట్స్… పిల్లల్ని తమ కంట్రోల్‌లో పెట్టుకుంటున్నారనమాట.. సాయంత్రం వేళ ఇదే ఆలోచిస్తూ ఇళ్లకు వచ్చే పిల్లలు…వాళ్లు తెల్లని మహిళను చూశామనీ… ఆమె జుట్టు పొడవుగా ఉందనీ… నది పక్కన తిరుగుతోందనీ ఇలా ఇంకాస్తా స్టాల్ పెప్పర్ యాడ్ చేసి చెబుతున్నారు. అలా అలా అలా తరతరాలుగా ఈ కథ కంటిన్యూ అవుతోంది.

మొత్తానికి ఒక థ్రిల్లర్ సినిమా తీసేయొచ్చు అనిపిస్తుంది కదా..నిజానికి హర్రర్ మూవీస్ అన్నీ ఇలాంటి నిజమైన ఆసక్తికర కథలనుంచే తీస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version