యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం” శేఖర్” ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ నటించారు. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించారు. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా ప్రదర్శన అన్ని థియేటర్లలో ఆగిపోయింది. రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు పరంధామ రెడ్డి. కోర్టు ఆదేశించినా డబ్బు డిపాజిట్ చేయకపోవడంతో తాజాగా సినిమా ఆపాల్సిందే అంటూ ఉత్తర్వులు వచ్చాయి.
తన దగ్గర 65 లక్షలు అప్పుగా తీసుకున్న దర్శకనిర్మాత జీవితా రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు ఫైనాన్షియర్ ఏ. పరంధామ రెడ్డి. కోర్టు తీర్పు పై స్పందించిన రాజశేఖర్.. తన సినిమాను కొందరు కుట్ర ప్రకారం అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎంతో కష్టపడి “శేఖర్” సినిమా తెరకెక్కించాం అని చెప్పారు. సినిమానే తమ జీవితమని.. శేఖర్ సినిమా తమకు ఒక హోప్ లాంటిదని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడాలో తనకు అర్థం కావడం లేదని రాజశేఖర్ ట్వీట్ చేశారు.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022