బ‌ర్త్ కంట్రోల్ ప్యాచ్‌.. నూత‌న గ‌ర్భ నిరోధ‌క ప‌ద్ధ‌తి మ‌రింత సౌక‌ర్య‌వంతం..

-

పిల్ల‌లు వ‌ద్ద‌నుకునే వారు సాధార‌ణంగానే బ‌ర్త్ కంట్రోల్ ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. స్త్రీలు అయితే పిల్స్ వేసుకుంటారు. పురుషులు అయితే కండోమ్స్ వాడుతారు. అయితే ఇవి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే బ‌ర్త్ కంట్రోల్ ఫెయిల‌వుతుంది. ఇక మ‌హిళ‌లు మింగే పిల్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి. కానీ ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండానే సుల‌భంగా బ‌ర్త్ కంట్రోల్ పాటించేలా ఓ నూత‌న విధానం అందుబాటులోకి వ‌చ్చింది. అదే బ‌ర్త్ కంట్రోల్ ప్యాచ్‌.

new birth control method birth control patch

బ‌ర్త్ కంట్రోల్ ప్యాచ్‌ల‌ను మ‌హిళ‌ల‌ను శ‌రీరంపై ధ‌రించాలి. దీంతో ఆ ప్యాచ్ నుంచి శ‌రీరంలోకి ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు విడుద‌లవుతాయి. అవి ప్రెగ్నెన్సీ రాకుండా చూస్తాయి. గ‌ర్భాశ‌య గోడ‌ల‌పై ఉండే మ్యూక‌స్‌ను దృఢ ప‌రుస్తాయి. అలాగే అండాలు విడుద‌ల అవ‌కుండా చూస్తాయి. దీంతో గ‌ర్భం రాదు. గ‌ర్భం రాకుండా నిరోధించే ప‌ద్ధ‌తుల్లో ఇది అత్యంత సుల‌భ‌మైంద‌ని, 99 శాతం వ‌ర‌కు ఫ‌లితం ఉంటుంద‌ని సైంటిస్టులు తెలిపారు.

అనేక ర‌కాల గ‌ర్భ నిరోధ‌క ప‌ద్ధ‌తులు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ఈ బ‌ర్త్ కంట్రోల్ ప్యాచ్ ద్వారా గ‌ర్భం రాకుండా ఆప‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. అయితే వీటిని వాడేట‌ప్పుడు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

బర్త్ కంట్రోల్ ప్యాచ్ వేసుకునే వారు చేతిపై, పొట్ట మీద‌, పిరుదుల మీద వేసుకోవాలి. ఆ ప్ర‌దేశం శుభ్రంగా, పొడిగా ఉండాలి. ప్యాచ్‌ను అప్లై చేశాక 10 సెక‌న్ల పాటు దానిపై ఒత్తిడి క‌లిగిస్తూ అంటుకునేలా చేయాలి. వారానికి ఒక‌సారి ఆ ప్యాచ్‌ను మార్చాలి. అంటే శుక్ర‌వారం ఉద‌యం ఆ ప్యాచ్‌ను వేసుకుంటే మ‌ళ్లీ శుక్ర‌వారం ఉద‌య‌మే ఆ ప్యాచ్‌ను మార్చాలి. ఇక నీటిలో త‌డిసినా ఆ ప్యాచ్‌కు ఏమీ కాదు. ఇక ఈ ప్యాచ్‌లు త్వ‌ర‌లోనే మార్కెట్‌లో ల‌భ్యం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news