వాట్సప్ లో మరో అదిరిపోయే ఫీచర్..!

-

New Feature in Whatsapp

ఇది నిజంగా బ్రహ్మాండమైన ఫీచరే. వాట్సప్ కు ఏదైనా సందేశం లేదా ఫోటో, వీడియో వచ్చిప్పుడు నోటిఫికేషన్ వస్తుంది తెలుసు కదా. మామూలుగా ఆ సందేశాన్ని కానీ.. ఫోటోను, వీడియోను కానీ ఓపెన్ చేస్తే ఏమౌతుంది. వాట్సప్ యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ లో వీడియోలు ప్లే అవుతాయి. అయితే.. ఇప్పుడు వచ్చే కొత్త ఫీచర్ తో ఇక యాప్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు.

ఎవరైనా మీకు వీడియో పంపిస్తే.. ఆ వీడియోను నోటిఫికేషన్ లోనే చూసుకోవచ్చు. మళ్లీ యాప్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్ లలో ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ఐఓఎస్ యూజర్లు మాత్రం 2.18.102.5 ఐఓఎస్ వర్షన్ ను అప్ డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ వాళ్లకు అందుబాటులోకి వస్తుంది. అయితే.. ఇది ఇంకా టెస్టింక్ దశలోనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news