పాము విషంతో చేసిన సూపర్ గ్లూ క్షణాల్లో రక్తస్రావాన్ని ఆపుతుంది..!

-

సాధారణంగా పాములు అంటే చాలా మంది భయపడుతుంటారు. అయితే పాము విషం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయని సైంటిస్టులు అంటున్నారు. అయితే రక్తస్రావాన్ని ఆపడానికి ఈ సూపర్ గ్లూ బాగా ఉపయోగపడుతుందని.. దీనిని పాము విషం తో తయారు చేశారని చెబుతున్నారు.

ఇంటర్నేషనల్ స్టడీ ప్రకారం సౌత్ ఆఫ్రికా లో బాగా విషపూరితమైన పాము విషంతో ఈ సూపర్ గ్లూ ని తయారు చేశారు. ఇది రక్తస్రావాన్ని ఆపేస్తుంది. అయితే దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే.. గాయం ఉన్న ప్రాంతంలో ఈ గ్లూ ని అప్లై చేసి ఆ తర్వాత దాని మీద లైట్ వేస్తే ఆ ప్రాంతమంతా కూడా సీల్ అయిపోతుంది.

మీరు కావాలంటే లేజర్ పాయింటర్ ని వాడచ్చు లేదు అంటే ఫ్లాష్ లైట్ కూడా బాగా పని చేస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల టెంపరరీగా ఆ ప్రాంతమంతా కూడా మూసుకుని ఉంటుంది. దీనితో రక్తస్రావాన్ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు.

అయితే ఇలా లైట్ చూపించడం వల్ల వేగంగా పాలిమరైజేషన్ అవుతుందని చెప్తున్నారు. క్లినికల్ సర్జరీ కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని తెలుస్తోంది. పది రెట్లు ఇది బైండింగ్ చేస్తుంది. తీవ్రమైన గాయాలు అయినా ఏదైనా కట్ అయిన ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆ ప్రాంతం అంతటినీ కూడా సీల్ చేసి రక్తస్రావం అవ్వకుండా చూసుకుంటుందని నిపుణులు చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news