హైదరాబాద్: దళితబందు కేవలం కార్యక్రమం కాదని, ఉద్యమమని సీఎం కేసీఆర్ అని అన్నారు. దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ప్రగతి భవన్‌లో అవగాహన సమావేశం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హుజురాబాద్‌లో దళితబంధు పథకం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పథకం ప్రభావం యావత్ తెలంగాణపై ఉంటుందని చెప్పారు. పథకం విజయవంతానికి ప్రతి ఒక్కరూ దృఢ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నమ్మిన ధర్మానికి కట్టుబడి కొనసాగితేనే విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రకటించిన విసయం తెలిసిందే. ఈ ఉదయం ప్రారంభమైన సదస్సు.. సాయంత్రం వరకు కొనసాగనుంది. ఈ సమావేశానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి, మున్సిపాలిటీల పరిధిలోని ప్రతి వార్డుకు నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు.. ఇద్దరు మహిళలు) మొత్తం 412 మందితో పాటు 15 మంది రీసోర్స్ పర్సన్లు హాజరయ్యారు.