వావ్.. నివేదా థామస్.. నీ డ్యాన్స్ అదుర్స్..!

-

హీరోయిన్ నివేదా థామస్ గుర్తుందా? గుర్తుండే ఉంటుందిలే. జెంటిల్ మెన్, నిన్ను కోరి, జై లవ కుశ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది నివేదా. తన నటనతో తెలుగు సినీ అభిమానులను బాగానే ఆకట్టుకున్నది నివేదా. ఈ మధ్య ఎక్కువగా తెలుగు సినిమాల్లో కనిపించనప్పటికీ.. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నది. ప్రస్తుతం నిఖిల్ తో శ్వాస అనే సినిమాలో నటిస్తున్నదట.

ఇక.. తన సినిమాల సంగతి పక్కన బెడితే.. నివేదా డ్యాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన సోదరుడితో కలిసి ప్రభుదేవా గులేభకావలి సినిమాలోని ఓసాంగ్ కు బీభత్సంగా స్టెప్పులేసింది నివేదా. ఆ డ్యాన్స్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వావ్.. నివేదా.. డ్యాన్స్ అదరగొట్టావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. పార్టీలో ఎంజాయ్ చేయాలంటే హీల్స్ విసిరేసి.. వెళ్లి డ్యాన్స్ చేయడమే.. అంటూ ఆ వీడియోకు క్యాప్సన్ కూడా పెట్టింది నివేద.

Read more RELATED
Recommended to you

Exit mobile version