వాట్సాప్ మరో సారి తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఇక వాట్సాప్ యూజర్స్ తమ పర్సనల్ చాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించింది. వాట్సాప్‌లో ఇంక మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం!
మీ చాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్‌వర్డ్ సెట్ చేయాలి. మళ్లీ మీరు ఆ చాట్స్ రీస్టోర్ చేయాలనుకుంటే పాస్‌వర్డ్ సెట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సరికొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని కూడా ఇటీవలె షేర్ చేసింది. వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌కి ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సప్‌లోని చాట్లను బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన చాట్æ్స బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది వాట్సప్. పాస్‌వర్డ్ సెట్ చేస్తే ఆ చాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి.
వాట్సాప్ చాట్స్ బ్యాకప్‌కి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు బీటా యూజర్ అయితే మీ వాట్సప్ యాప్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. బీటా యూజర్లు విజయవంతంగా పరీక్షించిన తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. మరోవైపు సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫోటోస్ ఫీచర్‌ని కూడా టెస్ట్ చేస్తోంది వాట్సాప్. ఫోటోలు ఆటోమెటిక్‌గా డిలిట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్‌లో వచ్చే ఫార్వర్డ్ ఇమేజెస్, ఫోటోస్ వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. వాటిని డిలిట్ చేసేందుకు ప్రత్యేక సమయం కేటాయించాల్సి వస్తుంది. సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫోటోస్ ఫీచర్ వస్తే మీరు సెట్ చేసిన సమయానికి ఆ ఫోటోలు డిలిట్ అవుతాయి.
అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని కూడా వాట్సప్ అందించనుంది. ఇప్పటికే ఉన్న డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్‌ని మార్చనుంది. ప్రస్తుతం వారం రోజులు మాత్రమే టైమ్ సెట్ చేయొచ్చు. వాట్సప్ 24 గంటల ఫీచర్‌ని పరీక్షిస్తుంది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే వాట్సప్‌లోని మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అయిపోతాయి. ప్రస్తుతం వారం రోజుల పాత మెసేజెస్ డిలిట్ అవుతాయి. త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ అయ్యే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.