చాలా రోజులుగా నానుతున్న అంశం మీద ఏపీ బీజేపీ క్లారిటీ ఇచ్చింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అనే అంశం మీద ఏపీ బీజేపీ ఇంచార్జ్ మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు. తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని మురళీధరన్ ట్వీట్ చేశారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోవడంతో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
GHMC ఎన్నికల్లో బీజేపీ కోరిక మేరకు వెనక్కి తగ్గినందుకు గాను తిరుపతి ఉప ఎన్నికల్లో తమకు సీటు కేటాయించాలని జనసేన ముందు నుంచి కోరుతోంది. ఈ విషయం మీద ఏపీ బీజేపీతో అలానే బీజేపీ పెదాలతో కూడా పవన్ చాలా సార్లు చర్చలు జరిపారు. తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఓట్లు తమకు ఎక్కువగా ఉన్నాయని జనసేన లెక్కలు వేసినా బీజేపీ మాత్రం జనసేనకు సీట్ ఇవ్వకపోవడం గమనార్హం.
Leading the ‘fight for the people & by the people,’ a @BJP4Andhra‘s candidate, backed by @JanaSenaParty will fight Tirupati by-election
A unanimous decision was taken at a meeting attended by Shri @PawanKalyan Ji & Shri @somuveerraju Ji.@JPNadda @Sunil_Deodhar @blsanthosh
— V Muraleedharan (@VMBJP) March 12, 2021