ఇండెన్ గ్యాస్ సిలిండ‌ర్ పై పేటీఎమ్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. త్వ‌ర‌ప‌డండి..!

ప్ర‌స్తుతం గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. రీసెంట్ గా పెరిగిన ధ‌ర‌ల‌తో సామాన్యుల జేబుల‌కు చిల్లులు ప‌డుతున్నాయి. అస‌లు వంట గ్యాస్ వెలిగించాలంటేనే భ‌య‌ప‌డిపోయే రోజులు వ‌స్తున్నాయి. అలాంటి వారంద‌రూ ఏమైనా డిస్కౌంట్ ఉంటే బాగుండ‌ని కోరుకుంటున్నారు. కానీ అది కుద‌ర‌ట్లేదు. ఇలా బాధ‌ప‌డే వారికోసం ఇప్పుడు ఓ అద్భుత‌మైన ఆఫీర్ వ‌చ్చేసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా పేటీఎం యాప్ గ్యాస్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని తీసుకొస్తోంది. అంతేకాదు ఈ యాప్‌లో ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే క‌స్ట‌మ‌ర్ల కోసం మంచి ఆఫర్ కూడా అందిస్తోంది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.900 క్యాష్ బ్యాక్ వ‌ర‌కు ఇచ్చేందుకు రెడీ అయింది పేటీఎమ్‌.

gas cylinder
gas cylinder

ఇందుకోసం ఇండేన్ గ్యాస్ గ్యాస్ సిలిండర్ కోసం పేటీఎం యాప్ లో లాగిన్ అయ్యి గ్యాస్ బుకింగ్ ను http://bit.ly/3xooDLV లింక్ ద్వారా చేసుకుంటే స‌రిపోతుంది అని పేటీఎమ్ మేనేజ‌ర్లు తెలిపారు. ఇందుకోసం ఐదు స్టెప్ లు ఉన్నాయి. అవేంటంటే.. మొద‌ట‌గా Paytm యాప్ ఓపెన్ చేసి ఇండేన్ గ్యాస్ బుకింగ్ పేజీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అక్క‌డ క‌స్ట‌మ‌ర్ త‌న మొబైల్ నంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీ నెంబ‌ర్ ను ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత మీ గ్యాస్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకుని, ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. ఇక ఫైన‌ల్ గా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లాంటి ఆన్ లైన్ పేమెంట్ ఆప్ష‌న్‌ల‌ను సెలెక్ట్ కుని పేమెంట్ చేస్తే స‌రిపోతుంది.