పిడుగుపాటు నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

-

దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇక వర్షాకాలం కూడా మొదలైంది. తాజాగా వర్షం వల్ల వచ్చే పిడుగుపాటు(Thunderstorm)తో కూడా మరణాలు ఎక్కువ శాతం నమోదు అయిన సంఘటనలు కళ్లారా చూశాం. అయితే, ఉరుములు, మెరుపులు ఎలా ఏర్పడతాయో.. అలాగే పిడుగుపాటుకు గురికాకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం. దీంతోపాటు వర్షాకాలంలోనే అనేక ప్రకృతి వైపరీత్యాలు సైతం సంభవిస్తాయి.అసలు మెరుపులు ఏలా ఏర్పడతాయంటే మేఘాల్లోకి ధన,రుణావేశాల వల్ల ఏర్పడే శక్తిని మెరుపు అంటారు.ఇది ఒక రకంగా విద్యుత్‌శక్తి. దీని తీవ్రత ఎక్కవ అయి శబ్దం చేస్తూ.. భూమిని చేరితే పిడుగుపాటు అంటారు. కొన్ని ప్రాంతాల్లో కోట్ల ఓల్టుల్లో కూడిన పిడుగు భూమి పై పడటంతో ప్రాణ, ఆస్తినషటం వాటిల్లుతుంది.

పిడుగుపాటు/Thunderstorm
పిడుగుపాటు/Thunderstorm

పిడుగు పాటుకు గురికాకుండా ఉండాలంటే..

పిడుగు పాటుకు గురయ్యే ప్రాంతాల గురించి ముందస్తు సమాచారాన్ని అందించే వ్యవస్థలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి కచ్చితత్వంపై అనుమానాలు కూడా ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తున్నప్పుడు.. పిడుగు పాటుకు గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

  • సాధారణంగా ఎత్తుగా ఉండే వాటిపైనే పిడుగులు ఎక్కువగా పడతాయి. అందువల్ల వర్షం వస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తయిన చెట్లు, టవర్లు, విద్యుత్‌ స్తంభాల వద్దకు వెళ్లకూడదు. ట్రా న్స్‌
    ఫార్మర్లకు కూడా దూరంగా ఉండాలి.
  • మేఘాలు ఏర్పడి వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడు, ఉరుముల శబ్దాలు వినిపించినప్పుడు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉరుములతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిసినప్పుడు బయటకు వెళ్లకూడదు. ఒకవేళ ఆ ప్రాంతాల్లో మీరు చిక్కుకుంటే వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలి.
  • పిడుగు పడే సమయంలో సురక్షితమైన ఆశ్రయం లేనప్పుడు కొన్ని జాగ్రత్తలతో ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. కొండలు, పర్వత ప్రాంతాలు, శిఖరాలు వంటి ఎత్తయిన ప్రాంతాల నుంచి వీలైనంత త్వరగా కిందకు వెళ్లాలి.
  • పొలాల్లో పనిచేసే రైతులు వీలైనంత త్వరగా ఇళ్లకు లేదా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి. ఆ సమయంలో నేలమీద నిటారుగా నిల్చొని ఉండకూడదు. మీ శరీరాన్ని బంతిలాంటి స్థితిలో ఉంచాలి. తలను కిందకు వంచి, చేతులను గుండ్రగా శరీరంపై కప్పి ఉంచాలి. ఆ సమయంలో కాలి వేళ్లు మాత్రమే భూమిని తాకేలా ఉండాలి.
  • గుంపుగా ఉండకూడదు. ఒకరికి ఒకరు దూరంలో ఉండాలి. ఒకవేళ మెరుపు భూమిపైకి వస్తే.. పిడుగు ప్రమాద తీవ్రత తగ్గుతుంది. చెరువులు, సరస్సులు, ఈత కొలనులు, బీచ్‌లు వంటి బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
  • ఇళ్లలో ఉన్నప్పుడు పిడుగు పడితే.. ప్లంబింగ్‌ వ్యవస్థ ద్వారా విద్యుత్‌ ప్రవహించే అవకాశం ఉంది. అందువల్ల ఉరుములతో వర్షం వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు శుభ్రం చేయడం వంటి పనులకు దూరంగా ఉండటం మంచిది. వాషింగ్‌ మెషి న్స్‌, డ్రైయర్స్, విద్యుత్‌తో కనెక్ట్‌ చేసిన ఇతర పరికరాలను ఉపయోగించవద్దు. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, డివైజ్‌లను ఉపయోగించకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news