తెలంగాణ రాజకీయాల్లో మొన్నటి దాకా ఎదురే లేదనుకున్న టీఆర్ఎస్(TRS)కు అనూహ్యంగా ఈటల రాజేందర్ రాజీనామాతో పెద్ద దెబ్బే తగిలింది. దాని నుంచి కోలుకోక ముందే ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంతో టీఆర్ ఎస్‌కు మరో సవాల్ ఎదురైంది. ఇక అటు షర్మిల కూడా పార్టీ ప్రకటించడం, బీజేపీ దూకుడు నేపథ్యంలో కేసీఆర్ టీమ్ అలర్ట్ అయింది.
వెంటనే రేవంత్‌కు దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ బలపడకుండా ఉండేందుకు ఎల్.రమణను గులాబీ కండువా కప్పి ఆహ్వానించింది. ఇందులో ఓ కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి గతంలో టీడీపీలో కీలక నేతగా ఉండటంతో ఆయనకు సన్నిహితంగా ఉన్న వాంరతా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉంది.
దీంతో మళ్లీ కాంగ్రెస్ ఎక్కడ బలపడుతుందో అని ఎల్.రమణను ముందే చేర్చుకుని ఆయన వెనకే ఆ పార్టీలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కీలకమైన నాయకులు, కార్యకర్తలు టీఆర్ ఎస్‌లోకి తీసుకోవచ్చని భావించి ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు టీఆర్ ఎస్ నేతలు. ఇక రమణ కూడా బీసీ నాయకుడే కావడంతో ఈటల స్థానాన్ని బీసీల్లో రమణ భర్తీ చేసే అవకాశం ఉందని టీఆర్ ఎస్ భావిస్తోంది. మొత్తానికి రేవంత్‌కు చెక్ పెట్టేందుకు టీఆర్ ఎస్ గట్టి ప్లానే వేసిందన్నమాట.