వర్షాకాలం వచ్చేసింది. వానలు కురుస్తున్నాయి. ఐతే వానలతో పాటు వచ్చే పిడుగుపాటు రాజస్థాన్ లో 25మందిని బలి తీసుకుంది. పిడుగు సృష్టించిన భీభత్సానికి మొత్తం 25మంది ప్రాణాలూ కోల్పోయారు. ఇంకా పలువురికి గాయలయ్యాయి. వర్షాకాలం రావడంతో ప్రకృతి మొత్తం ఒక్కసారిగా పంజా విప్పుతున్నట్టుగా ఉంది. పిడుగుపాటులు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ లోనే 16మంది పిడుగు భీభత్సానికి బలయ్యారు.
ఇంకా 25మంది గాయాల పాలయ్యారు. ప్రకృతి సృష్టించిన ఈ భీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఒక్కొక్కరి మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. వర్షాకాలంలో పిడుగు పాటు విపత్తులు సహజంగా సంభవిస్తూనే ఉంటాయి. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.