ముద్దు పెట్టుకోవడం వలన ఎన్ని సమస్యలు వస్తాయంటే..?

ప్రేమకి, కేరింగ్ కి ముద్దు ఒక చిహ్నం. నిజంగా మంచి రిలేషన్షిప్ లో ముద్దు చాలా ముఖ్యం. అయితే ముద్దు పెట్టుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి వాటి కోసం చూద్దాం.

ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్:

ముద్దు పెట్టుకోవడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి వాటి కోసం ఇప్పుడు ఒక లుక్ వేసేయండి.

Influenza :

ఇది ఒక మనిషి నుంచి ఇంకొకరికి సోకుతుంది. సాధారణంగా నోటి తుంపర్లు ద్వారా ఇది వస్తుంది. ఎవరైనా తుమ్మినా, దగ్గినా, మాట్లాడిన ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఒక రోజు నుండి ఏడు రోజుల పాటు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీని యొక్క లక్షణాలు చూస్తే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళునొప్పులు, నీరసం వంటివి ఉంటాయి.

Herpes:

దీనిని చాలా కామన్ గా cold sores లేదా fever blisters అంటారు. ఇది మ్యూకస్ నుండి స్ప్రెడ్ అవుతుంది. యూఎస్ లో 50 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలకు ఈ సమస్య ఉంది.

syphilis:

ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది నోట్లో కురుపులు వంటివి తీసుకొస్తాయి. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ముద్దు పెట్టుకోవడం ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. యాంటీ బయోటిక్స్ తో దీనిని క్యూర్ చేయొచ్చు.

Bacterial meningitis :

మ్యూకస్ కారణంగా ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య ముద్దు పెట్టుకోవడం వల్ల కూడా వచ్చే అవకాశం వుంది.