కరోనా కారణంగా ఎన్నో విపరీతాలు జరుగుతున్నాయి. కరోనా ప్రభావితం కానిదేదీ లేదు. బంధాలు కూడా కరోనా కారణంగా దెబ్బతిన్నాయి. వాటిల్లో భార్యాభర్తల బంధం కూడా ఒకటి. కరోనా కాలంలో పెరిగిన విడాకుల పూరీ జగన్నాథ్ మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. ఇద్దరు కలిసి ఎక్కువ రోజులు ఒకరి మొహం ఒకరు చూసుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దానివల్ల విడాకులు బాగా పెరిగాయి. మహమ్మారి కారణంగా ప్రపంచ చరిత్రలోనే ఇప్పటివరకు ఎక్కువ విడాకులు ఈ సంవత్సరమే జరిగాయి.
దీనికి కారణం అవతలి వారి మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం, ఇంకోటి స్వేఛ్ఛ లేకపోవడం అని చెప్పారు. యూకేలో 122శాతం విడాకులు పెరిగాయి. అమెరికా, చైనాలో కూడా ఎక్కువే ఉన్నాయి. వీటితో పోలిస్తే ఇండియాలో తక్కువే అయినప్పటికీ, గత సంవత్సరాలతో పోలిస్తే ఇండియాలో కూడా విడాకులు ఎక్కువయ్యాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, మిజోరాం, గోవా కేరళ ఉన్నాయి. ఒక్క ముంబై కోర్ట్ లోనే రోజుకి 25విడాకుల కేసులు ఫైల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ముంబై, ఢిల్లీలో జరిగిన పెళ్ళిళ్ళలో దాదాపు 40శాతం మంది విడాకులు తీసుకున్నారు.
విడాకులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో గోవా ప్రజలకు ప్రభుత్వం కొత్త నియమాన్ని పెట్టింది. పెళ్ళి చేసుకునే ముందు ఎందుకు చేసుకుంటున్నారనే కౌన్సిలింగ్ తీసుకోవాలని నిర్ణయించింది. ఇలాంటి నియమాలు అంతటా వస్తే బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే, అమ్మాయి, అబ్బాయి ఒక రెండు సంవత్సరాలు జాబ్ చేస్తేనే పెళ్ళి చేసుకోవాలి. ఇలా చేస్తే అనవసర పెళ్ళిళ్ళు తగ్గుతాయి. విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగినట్టు పెళ్ళి కోసం కోర్టుల చుట్టూ తిరిగి కౌన్సిలింగ్ అయ్యాకే పెళ్ళికి అనుమతి ఇవ్వాలి.
మరో రెండు దశాబ్దాలు ఆగితే పెళ్ళిళ్ళు బాగా తగ్గిపోతాయి. వివాహ బంధాలు 30శాతానికి పడిపోతాయి. చాలామంది ఒంటరితనం భరించలేక పెళ్ళి చేసుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే పెళ్ళయ్యాక అందరూ ఒంటరివాళ్ళే అవుతారు. ఈ కరోనా కాలంలో ఈ కరోనా కాలంలో బంధాలు నిలబెట్టుకోవాలంటే మీ భాగస్వామితో ఎక్కువ మాట్లాడకండి. బెడ్ మీద అటు మొహం చేసి పడుకోండి. అప్పుడే మీ వివాహ బంధం నిలబడుతుంది అని పూరీ జగన్నాథ్ మాట్లాడారు.