హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు తీసుకోవాలో తెలిపే నాలుగు కారణాలు..

-

కరోనా వచ్చాక ఆరోగ్య పట్ల శ్రద్ధ అందరికీ పెరిగింది. శుభ్రత, రోగనిరోధకశక్తి ఎంత మేలు చేస్తాయో తెలిసి వచ్చింది. అలాగే హాస్పిటల్ బిల్లులు కళ్ళు తిరిగేలా చేసాయి. ఈ నేపథ్యంలో అందరికీ తెలిసి వచ్చిన ఒక అంశం.. హెల్త్ ఇన్స్యూరెన్స్. కరోనా వీరవిహారం చేస్తున్న సమయాల్లో కొన్ని కొన్ని సార్లు హెల్త్ ఇన్స్యూరెన్స్ పై కూడా ఫిర్యాదులు వచ్చాయి. కానీ, అనుకోని పరిస్థితులు ఏర్పడినపుడు దానివల్ల కొంచెమైనా లాభం ఉంటుందని చాలామంది గ్రహించారు.

ఈ విషయమై నిపుణులు చెబుతున్న దాని ప్రకారం హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు తీసుకోవాలో కొన్ని కారణాలు..

వైద్యం ఖర్చు పెరగడం

రోజు రోజుకీ వైద్యం ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఒక్కోసారి సమస్యలు చెప్పిరావు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా గుండెనిబ్బరంతో ఉండడానికి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉపయోగపడుతుందని వారి వాదన.

ఆలస్యం విషం

హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునే చాలామంది ఇప్పుడు కాదులే వచ్చే సంవత్సరం చూద్దాం అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. ఎందుకంటే వయసు పెరుగుతున్నకొద్దీ జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున తక్కువ వయసులో తీసుకోవడం అన్నింటికీ మంచిది.

టాక్స్ బెనిఫిట్

హెల్త్ ఇన్స్యూరెన్స్ కి చెల్లించే డబ్బులు పన్ను మినహాయింపు కింద వాడుకోవచ్చు. దానికి కొన్ని సెక్షన్లు ఉంటాయి. ఇన్స్యూరెన్స్ సలహాదారులు అవి తెలియజేస్తారు.

కుటుంబ భద్రత

ఇన్స్యూరెన్స్ కారణంగా కుటుంబంలో భద్రత ఉంటుందనేది నిపుణుల వాదన. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే భద్రత ఎక్కువగా ఉంటుందన్నది ప్రస్తుతం కనిపిస్తున్న అంశం. ఎందుకంటే ప్రతీ పని డబ్బు చుట్టూనే తిరుగుతుంది. అందువల్ల డబ్బు ముఖ్యం. ఐతే అందరి దగ్గర కావాల్సినంత డబ్బు ఉండదు. అలాంటప్పుడు ఇన్స్యూరెన్స్ చాలా మేలు కలిగిస్తుందని సలహాదారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news