కావాలని ఏరికోరి పల్లెటూరు అమ్మాయని పెళ్లి చేసుకున్నాడు… చివరికి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు…!

-

అతని పేరు హరీష్ (పేరు మార్చాం) హైదరాబాద్ లో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి… తండ్రి కష్టపడి పెంచడం, కష్ట సుఖాలు తెలియడంతో జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుని… తన వివాహం ఇలాంటి అమ్మాయితో జరగాలని నిర్ణయం తీసుకుని అదే విషయాన్ని తల్లి తండ్రులకు చెప్పాడు. ఒక్కడే కుమారుడు కావడంతో అలాంటి అమ్మాయి కోసం వెతికారు తల్లి తండ్రులు. వైవాహిక జీవితం సరిగా ఉంటేనే తన జీవితం బాగుంటుందనుకుని భావించి పల్లెటూరు అమ్మాయి అయితే బాగుండని భావించి నిర్ణయం తీసుకున్నాడు.

 

తల్లి తండ్రులు సరిగా అలాంటి అమ్మాయిని తమ బంధువుల్లోనే వెతికారు. కాస్త కట్నం ఇవ్వడం, అమ్మాయికి లోక జ్ఞానం తక్కువగా ఉండటంతో వివాహం చేసుకున్నాడు… అందం ఆస్తి ఇవేమీ చూడకుండా వివాహం చేసుకున్న అతను కొంత కాలం ఆమెతో సాఫీగానే కాపురం చేసాడు. ఈ లోగా వారికి ఒక బాబు కూడా పుట్టాడు… అనూహ్యంగా ఇక్కడి నుంచే అమ్మాయి మనస్తత్వం బయటపడింది. తల్లి తండ్రులు వచ్చి వారిద్దరితో కలిసి ఉండటం మొదలుపెట్టారు. అత్తా మామలను కొన్నాళ్ళు భరించిన అతను ఆ తర్వాత అమ్మాయి తీరు మారకపోవడం, బాబు కూడా పుట్టడంతో గొడవలు వద్దనుకుని సర్దుకున్నాడు.

అక్కడి నుంచి అమ్మాయిలో మరో కోణం చూసాడు. అబ్బాయి తరుపున వాళ్ళ అక్కలు, తమ్ముళ్ళు, మేనకోడళ్ళు ఇలా ఎవరు వచ్చినా సరే ఆమె ఇంతో ఉండకుండా వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. తన అమ్మ వాళ్ళ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం వంటివి చేస్తుంది. ఈ పరిణామంతో అతను ఆశ్చర్యపోయాడు. ఇక వాళ్ళు ఎవరైనా వస్తే ఆమె వేధించడం, ఆ కోపాన్ని బాబు మీద చూపించడం మొదలుపెట్టింది. దీనితో భార్య కనపడకుండా వేధించడం భరించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చివరికి కొన్నాళ్ళకు అతను ఒక్కడే బ్యాచిలర్ గా జీవిస్తున్నాడని తెలుసుకున్న తల్లి తండ్రులు పరిస్థితిని అర్ధం చేసుకుని… కాపురం నిలబెట్టే ప్రయత్నం కూడా చేయడ౦ లేదట. మరి ఈ కథకు ఎలా ముగింపు ఏంటి అనేది తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Latest news