“సేవ్ నల్లమల” ఇదే సమయం రా కదలి రా..

-

న‌ల్ల‌మ‌లలో యురేనియం త‌వ్వ‌కాల వ్య‌వ‌హారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతోంది. యురేనియం త‌వ్వ‌కాల‌తో తెలుగు రాష్ట్రాల‌కు ఊపిరితిత్తుల్లాంటి న‌ల్ల‌మ‌ల అడ‌వులు స‌ర్వ‌నాశ‌నం అవుతాయ‌నే ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. ఈనేప‌థ్యంలోనే రాజ‌కీయ నేత‌ల‌తోపాటు, మేధావులు, ప‌ర్య‌వ‌ర‌ణ ప్రేమికులు , గిరిజ‌న ఆదివాసీ, ప్ర‌జా సంఘాలు రంగంలోకి దిగాయి. సేవ్ న‌ల్ల‌మ‌ల నినాదంతో ఉద్య‌మిస్తున్నాయి. ఇలా అన్ని వ‌ర్గాల నుంచి ఆందోళ‌న‌లు వ్య‌క్తం అ వుతుండ‌టంతో సినీ ప్ర‌ముఖులు, సెల‌బ్రెటీలు సైతం వీరికి బాస‌ట‌గా నిలుస్తున్నారు.

అస‌లే నిర్బంధాల కాలం..! పాలకుల‌ అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముప్పు ముంచుకొచ్చే సమ యం..! ఎంత రెబల్ క్యాండేట్లయినా.. క‌నీసం మాట్లాడటానికి వణికిపోతున్న సందర్భం.. ఈ ప‌రి స్థితుల్లోనూ భావితరాలకు తీవ్రంగా అన్యాయం జరగబోతోందని గ్ర‌హించిన మరుక్షణం సెలబ్రిటీలు ధైర్యంగా ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌భుత్వాల‌కు భయ‌ప‌డ‌కుండా .. భవిష్యత్ తరాల కోసం.. తమను తాము వంచించుకోవడం మానేశారు. తమ వర్జినల్ క్యారెక్టర్లను హీరోలుగా మార్చుకుంటున్నారు. న‌ల్ల‌మ‌ల‌ను ర‌క్షించుకుందామంటూ ఒక‌రికొక‌రు చేతులు క‌లుపుతున్నారు.

జాతీయ స్థాయిలో కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సేవ్ న‌ల్ల‌మ‌ల అంశంపై ఇటీవ‌ల తెలుగు సినీ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. యురేనియం పేరుతో ప‌చ్చ‌ని అడ‌వుల‌ను నాశ‌నం చేయొద్ద‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. “సేవ్ నల్లమల”కు మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఇతర సినీ ప్రముఖులూ మద్దతు తెలిపారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ముందుకు వచ్చారు. నిజానికి వీ రెవరికీ నల్లమలతో.. సంబంధం లేదు. మనకెందులే అనుకోలేదు. ప్రజలతో మమేకమైన సినీ రంగంలో… పేరు తెచ్చుకున్న వారు.. ఆ ప్రజల కోసం.. గొంతెత్తకపోతే.. అది ఆత్మవంచనే అవుతుందనుకున్నారు. అందుకే గళమెత్తారు. సేవ్ నల్లమల అని నినదిస్తున్నారు. ఒక్కొక్కరుగా… బయటకు వస్తున్నారు. నల్లమలను కాపాడుకునేందుకు… చేతులు కలుపుతున్నారు.

యురేనియం ప్లాంట్‌తో ఎంత దుష్ప్ర‌భావాలు ఉంటాయో పులివెందులే సజీవ సాక్ష్యం..! ఎక్కడో ఉండే అమెజాన్ అడవి తగలబడిపోతుంటే.. ఇక్కడ సెలబ్రిటీలు స్పందించారు. మంచిదే.. కానీ తెలుగు రా ష్ట్రాల్లో విస్తరించిన నల్లమలకు అంత కంటే.. పెద్ద ప్రమాదం…యూరేనియం తవ్వకాలతో వచ్చింది. దా న్ని కాపాడుకోవడానికి.. సెలబ్రిటీలు ముందుకు రాకపోతే.. ప్రజలు నిజాయితీని శంకిస్తారు. చ‌రిత్ర‌లో దోషులుగా మిగిలిపోతారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అడవిలో తవ్వకా లు ప్రారంభించిన తర్వాత ఇక ఎవ‌రూ చేసేదేమీ ఉండదు. అందుకే.. సెలబ్రిటీలు అడుగు ముందుకు వేశారు. ఇక వారితో రాజకీయ పార్టీల‌తోపాటు, సాధారణ ప్రజలు కూడా చేతులు క‌ల‌పాల్సిన స‌మ‌యం ఆశ‌న్న‌మైంది.

 

Read more RELATED
Recommended to you

Latest news