భూమిలాంటి మ‌రొక గ్ర‌హాన్ని గుర్తించిన శాస్త్ర‌వేత్త‌లు.. అదెంత దూరంలో ఉందంటే..?

-

అచ్చం భూమిలా ఉన్న ఓ సూప‌ర్ ఎర్త్ ను సైంటిస్టులు తాజాగా క‌నుగొన్నారు. దానికి జీజే 357డి అనే పేరు కూడా పెట్టారు. స‌ద‌రు సూప‌ర్ ఎర్త్ భూమి నుంచి 31 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉంద‌ట‌.

ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల‌ను ఎప్ప‌టి నుంచో వేధిస్తున్న ప్ర‌శ్న ఒక‌టుంది.. భూమి లాంటి గ్ర‌హం అంత‌రిక్షంలో ఉందా..? అని.. సైంటిస్టులు ఎప్ప‌టి నుంచో ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. అయితే వారి ప్ర‌శ్న‌ల‌కు తాజాగా స‌మాధానం దొరికిందా.. అంటే.. అందుకు అవుననే స‌మాధానం వినిపిస్తోంది. అచ్చం భూమిలా ఉన్న ఓ సూప‌ర్ ఎర్త్ ను సైంటిస్టులు తాజాగా క‌నుగొన్నారు. దానికి జీజే 357డి అనే పేరు కూడా పెట్టారు.

scientists discovered earth like planet

కాగా స‌ద‌రు సూప‌ర్ ఎర్త్ భూమి నుంచి 31 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉంద‌ట‌. ఒక కాంతి సంవ‌త్స‌రం అంటే.. కాంతి ఒక సంవ‌త్స‌రంలో ప్ర‌యాణించే దూరాన్ని ఒక కాంతి సంవ‌త్స‌రం అంటారు. ఇది 10 ట్రిలియ‌న్ కిలోమీట‌ర్లు. కాగా ఆ సూప‌ర్ ఎర్త్‌పై భూమి లాంటి వాతావ‌ర‌ణం ఉంద‌ని సైంటిస్టులు గుర్తించారు. అలాగే దాని ఉపరితంపై నీరు కూడా ఉండి ఉంటుందని వారు అంచ‌నా వేస్తున్నారు.

ఇక ఆ సూప‌ర్ ఎర్త్ సూర్యున్ని పోలిన ఓ మ‌రుగుజ్జు న‌క్ష‌త్రం చుట్టూ ప‌రిభ్ర‌మిస్తున్న‌ద‌ట‌. ఆ న‌క్ష‌త్రం సూర్యుడిలో 1/3వ వంతు సైజులో ఉంటుందని, సూర్యునితో పోలిస్తే 40 శాతం చ‌ల్ల‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు అంచ‌నా వేస్తున్నారు. కాగా ఆ న‌క్ష‌త్రం నుంచి వ‌చ్చే కాంతి 3.9 రోజుల‌కు ఒక‌సారి త‌గ్గుతుంద‌ని కూడా సైంటిస్టులు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే ఈ న‌క్ష‌త్రంతోపాటు ఆ సూప‌ర్ ఎర్త్‌ల‌ను కూడా భారీ టెలిస్కోపులను ఉప‌యోగించి మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేస్తామ‌ని వారు వెల్ల‌డించారు. అయితే ఒక వేళ ఆ సూప‌ర్ ఎర్త్‌పై మాన‌వులు నివ‌సించేందుకు అనువుగా వాతావ‌ర‌ణం ఉంటే.. అప్పుడు అక్క‌డికి శాటిలైట్ల‌ను కూడా పంపే అవ‌కాశం ఉంటుంద‌ని వారు భావిస్తున్నారు. మ‌రి ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news