ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ వీడియో Viral video లదే రాజ్యంగా మారుతోంది. ప్రతీ రోజు ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, ఈ రోజు ఉన్న వైరల్ కంటెంట్ రేపు కూడా ఉంటుందన్న గ్యారంటీ సోషల్ మీడియా నిపుణులు కూడా ఇవ్వలేరు. కాగా, డిఫరెంట్ అండ్ యూనిక్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ విషాదకర వీడియో వైరలవుతోంది. అందులో ఏముందంటే..
అర్జెంటీనాలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను సముద్రం తనలోనికి లాగేసుకుంది. ఈ షాకింగ్ వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, దానిని ఎవరో ఒకతను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది నెట్టింట వైరలవుతోంది. సముద్ర మట్టం పెరగడంతోనే భవంతి నిర్మాణం బలహీనపడి పిల్లర్స్ కుంగిపోయి భవనం మొత్తంగా సముద్రంలోకి మునిగిపోయింది. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ప్రాబ్లమ్ వల్లే ఇలా జరిగిందని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఓసియన్ దగ్గరలో ఇండ్లు కట్టుకోవద్దని ఆఫీసర్లు సూచించినప్పటికీ అక్కడే కట్టారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28న అర్జెంటీనా రాజధాని బ్యూనెస్ ఏర్స్‌కు సమీపంలోని మార్ దెల్ ట్యుయూ సిటీలో ఈ ఘటన జరిగింది. అయితే, సముద్రం తనలోనికి బిల్డింగ్‌ను తీసుకుపోయే క్రమంలో బిల్డింగ్ ఎవరూ లేకపోవడం అదృష్టమనే చెప్పొచ్చు. ఈ విషయం తెలుసుకుని స్థానికులు ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే ప్రాణాలతో ఉండకపోయేవారని చెప్తున్నారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు భయంగానే ఉంటుంది. ఇక సముద్ర అలల తాకిడికి బిల్డింగ్ వాల్స్ కొంచెం కొంచెంగా పటుత్వం కోల్పోవడం మనం గమనించొచ్చు. పిల్లర్స్ అన్నీ కూడా ఒక పక్కకే ఒరిగిపోయాయి. ఈ ఘటన చూస్తుంటే విషాదకరమైనది అని అనిపించినప్పటికీ ఒక్క ప్రాణ నష్టం జరగకపోవడం గమనించాలి.
After teetering on the edge for some time, a house in Buenos Aires, Argentina, has finally collapsed into the sea.
Watch more videos from Sky News: https://t.co/3ZESAqWhX3 pic.twitter.com/8cZE8LKe8S
— Sky News (@SkyNews) July 30, 2021