హుజూరాబాద్ వార్: సరికొత్త రికార్డు సృష్టిస్తుందా?

-

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ తెలంగాణ ప్రజల్లో ఉంది. అటు ప్రధాన పార్టీలు కూడా ఈ ఉపఎన్నికపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఎన్నికలు అనగానే డబ్బులు పంపకాలు మామూలుగానే జరుగుతాయి. అధికారికంగా ఎన్నికల ఖర్చుకు ఓ పరిమితి ఉందనే సంగతి తెలిసిందే.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

కానీ అనధికారికంగా ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు అవుతుందో బహిరంగ రహస్యమే. సాధారణంగా ఏపీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. అయితే నిదానంగా తెలంగాణ ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ అనేది జోరుగా సాగుతుంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూలేని విధంగా హుజూరాబాద్ ఉపఎన్నిక అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్న ఎన్నిక కానుందని విశ్లేషణలు వస్తున్నాయి….వార్తా కథనాలు ఇస్తున్నాయి.

ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పేరిట ఏ స్థాయిలో ఖర్చు పెడుతుందో అందరికీ తెలిసిందే. అటు ఎన్నికల ప్రచారం పేరిట టీఆర్ఎస్, బీజేపీలకు ఎంత ఖర్చు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా షెడ్యూల్ రాకముందే నాయకులకు ఖర్చు తడిసిమోపెడు అవుతున్నట్లు కనబడుతోంది.

ప్రచారానికి, కార్యకర్తలని మెయిన్‌టైన్ చేయడానికి, వాహనాలకు, భోజనాలకు అబ్బో ఒక్కటి ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలకు ఖర్చు భారీగానే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కీలక ఘట్టం ఎన్నికల ముందు ఉంటుంది. అప్పుడు ఒక్కో పార్టీ డబ్బుల పంపిణీ ఏ మేర చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అంటే ఓటుకు నోటు ఇవ్వనిదే ఎన్నికలకు అర్ధం ఉండదనే స్థాయికి రాజకీయ నాయకులు పరిస్తితి తీసుకొచ్చేశారు. మరి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతాయో, రాజకీయ నాయకులకే తెలియాలి. ఏదేమైనా ఎన్నికల ఖర్చులో హుజూరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించనుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news