ఒలంపిక్స్ పై మేరీ కోమ్ సంచలన ఆరోపణలు.. చీటింగ్ చేశారంటూ !

-

టోక్యో ఒలంపిక్స్ పై భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టోక్యో  ఒలంపిక్స్ లో తనను చీటింగ్ చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది బాక్సర్ మేరీ కోమ్. టోక్యో నుంచి కాసేపటి క్రితమే మేరీ కోమ్ ఇండియా కు చేరుకుంది.

ఈ సందర్భంగా మేరీ కోమ్ మీడియాతో మాట్లాడుతూ… “ఖాళీ చేతులతో రావడం తనకు చాలా బాధాకరంగా ఉంది. నేను పతకం తో తిరిగి వద్దామని అనుకుంటున్నాను. నాకు మన భారతదేశం మొత్తం మద్దతు తెలిపింది. బాక్సింగ్ రౌండ్ ఆఫ్ 16 బోరులో నాకు మోసం జరిగింది. నేను మొదటి రెండు రౌండ్లు గెలిచాను. అయినా నేను ఓడిపోయాను అని ప్రకటించారు. ఏది ఏమైనా నా నేను ఈ దేశానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇంకా వయసు ఉంది. 40 సంవత్సరాలు వచ్చే వరకు బాక్సింగ్ ఆడతాను. మరోసారి కచ్చితంగా పతకం చేస్తాను” అంటూ  మేరీ కోమ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news