సంచ‌ల‌నం రేపుతున్న యూకే సైంటిస్టుల ప్ర‌క‌ట‌న‌.. ఏమ‌న్నారంటే

-

ఒకవైపు 18 ఏండ్ల పై బ‌డిన వారికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇంకో వైపు చిన్న‌పిల్ల‌ల‌కు, టీనేజ్ పిల్ల‌ల‌కు ఈ టీకా వేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. టీనేజర్లకు త్వరలోనే కరోనా టీకాలు అందుబాటులోకి రానున్నాయ‌ని ప‌లు సంస్థలు తెలుపుతున్నాయి. కొన్ని టీకాలు కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చిన‌ట్లు స‌మాచారం. పిల్ల‌ల‌కు వ్యాక్సినేషన్ విషయంలో తొందరపాటు వద్దంటూ యునైటెడ్ కింగ్‌డ‌మ్ నిపుణుల కమిటీ సూచనలు చేసింది. వారి దేశంలో 12 నుంచి 17 యేళ్ల ఏజ్‌ పిల్లలకు వ్యాక్సిన్లను సూచించ‌డం లేద‌ని తెలిపింది.

jhonson and jhonson vaccine

ఈ విషయంలో ఆలోచించి స్పందించాలని వివ‌రిస్తోంది. ఆ వయసు పిల్లల్లో ఎవ‌రికైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది ప‌డుతూ ఉంటే అలాంటి వారికి ప్రయోగాల్లో స‌క్సెస్ అయిన వ్యాక్సిన్లను ఇవ్వాలని వారు తెలుపుతున్నారు. క్యాన్సర్లు డయాబెటిస్ వంటి రోగులైన టీనేజర్లకు మాత్రమే టీకా ఇవ్వాలని తెలిపింది. ఆరోగ్యవంతులైన వారి కరోనా టీకా అవసరం లేదని సూచించింది.
అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వంటి దేశాల్లో టీనేజర్లకు టీకా ఇస్తున్నారు. అక్కడ వ్యాక్సిన్లు వయోజనులతో పాటు టీనేజర్లకు కూడా అందుబాటులోకి ఉన్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో వారికి కూడా ఆరోగ్య పరిస్థితుల్లో సంబంధం లేకుండా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ అంశంలో యూకే నిపుణులు మాత్రం పున‌రాలోచించుకోవాలంటున్నారు. కొందరు పరిశోధకులు ఈ విషయంలో ఇది వరకూ కూడా అభ్యంతరం తెలిపారు. రోగ‌నిరోధకత మంచి స్థాయిలో ఉండి క‌రోనాను ఎదుర్కొనగల శక్తి ఉన్నవారికి వ్యాక్సిన్ ఎందుకు అని ప్రశ్నించారు. పిల్ల‌ల‌కే కాదు ఒకసారి క‌రోనాకు గురై కోలుకున్న వారికి కూడా టీకా అవసరం లేదన్నట్టుగా తెలిపారు. ప్ర‌స్తుతం యూకే నిపుణులు తెలిపిన విథంగా టీనేజర్లకు వ్యాక్సిన్ అవసరం లేదన్న వాదనను తెర మీదకు తీసుకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news