ఇప్పుడు మన టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ లో టెస్టు మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే . అయతే కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఇరు జట్ల నడుమ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో మన హిట్ మ్యాన్ రోహిత్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. కాగా టెస్టు మ్యాచుల్లో గతంలో రోహిత్ పెద్దగా రాణించిన దాఖలాలు చాలా తక్కువ. ఈ మధ్య అయితే మరీ తక్కువగా సెంచరీలు చేశారు. కాగా ఇప్ఉడు ఓపెనర్ రోహిత్ శర్మ ఈ సెంచరీతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడు మరోసారి హైలెట్ అయ్యాడు.
ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై ఆయన సెంచరీ చేయడంతో ఈ గడ్డపై మన భారత దేశం నుంచి అత్యధిక సెంచరీలు చేసిన విదేశీయుల జాబితాలో టాప్ రేంజ్ కు దూసుకుపోయాడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇప్పటికే ఈ హిట్ మ్యాన్ తన క్రికెట్ కెరీర్ లో ఇంగ్లండ్ గడ్డమీద దాదాపుగా మొత్తం తొమ్మిది సెంచరీలను నమోదు చేశాడు. ఈ రికార్డుతో హిట్ మ్యాన్ సీనియర్ రాహుల్ ద్రావిడ్ నమోదు చేసిన రికార్డును అధిగమించాడని చెప్పొచ్చు.
కాగా రాహుల్ ద్రవిడ్ టెస్టులతో పాటు వన్డేలు కలిపి ఇప్పటి వరకు ఇంగ్లండ్ లో ఎనిమిది సెంచరీలు నమోదు చేశారు. కానీ రోహిత్ మాత్రం ఆయన్ను అధిగమించి ఇప్పుడు తొమ్మిదో సెంచరీని నమోదు చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే టెస్టుల్లో విదేశాల్లో రోహిత్ సెంచరీ చేయడం ఇదే తొలి సారి. అంటే ఇంతకు ముందు ఇంగ్లండ్ లో వన్డే మ్యాచ్‌లలో సెంచరీలు బాదాడు కానీ టెస్టు మ్యాచుల్లో మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఇంకో విషయం ఏంటంటే టీ20ల్లో కూడా ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ చేసిన ఘనత కేవలం రోహిత్ కు మాత్రమే ఉందండోయ్. ఇక ఇప్పుడు రోహిత్‌కు ప్రశంసలు అందుతున్నాయి.