మీ భాగస్వామిపై మీకు సందేహంగా, అనుమానం ఉంటే ఇలా తెలుసుకోండి. మన జన్మనక్షత్ర తిథులను బట్టి రాశులను నిర్ణయిస్తారు. వీటి ద్వారా వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచన వేయవచ్చనేది మన నమ్మకం. కాబట్టి మీ భాగస్వామి ఏ రాశి వాటి స్వభావాలను బట్టి అంచనా వేయవచ్చు. భార్యా భర్తల బంధంలో ఎక్కువగా బాధపట్టేది మోసం. కొందరు గొడవలకు కూడా కారణం ఇదే. మీ భాగస్వామి మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నాడో జోతిషశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చంట. వివిధ రాశుల వారి కారణాలేంటో చూద్దం.
మేషరాశి: మేషరాశి వారు పనిచేసే ముందు ఆలోచించకుండా చేసేస్తారు. ఈ విధంగానే తమ భాగస్వామిని మోసం చేసేస్తారు. సాధారణ బంధాలకు కూడా తమ భాగస్వామిని సులువుగా మోసం చేస్తారు.
వృషభం: ఈ రాశివారు భాగస్వామికి చాలా నమ్మకస్తులు. వారితో ఆనంద జీవితాన్ని గడుపుతారు. తమ జీవితంలో అన్ని అందంగా, ఆనందంగా ఉండాలని భావిస్తారు. ఒక్కోసారి వారి ఆలోచన ధోరణి మారుతూ ఉంటుంది.
మిథునం: మిథున రాశి వారు తమ ప్రతీది కొద్ది రోజులకే బోరింగ్ ఫీలవుతారు . ఎప్పుడు కొత్తదనం కోసం పరితపిస్తారు. తమ భాగస్వామికి బదులుగా వేరే వారికే అధిక ప్రాధాన్యతనిస్తారు.
కర్కాటక రాశి: చాలా సున్నిత మన స్తత్వం ఉన్నవారు. తమ భాగస్వామిని చాలా ఇష్టపడతారు. బంధానికి కట్టుబడి ఉంటారు.
కన్యరాశి: కన్యరాశివారు ప్రతి విషయంలో క్లారిటీగా ఉంటే చాలా ఇష్టం. భాగస్వామి మోసం చేస్తే వారిని మోసం చేసే అవకాశం ఉంది.
తుల: వీరు ఎక్కువ మందిని ప్రేమిస్తారు. ఎక్కువ ప్రేమ కోరుకుంటారు. భాగస్వామి వైను నుంచి దక్కనప్పుడు వారు ఇతరులకు ఆకర్షితులవుతారు.
వృశ్చికం: ఈ రాశివారు చాలా మందిని నిశీతంగా గమనించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారు. మీరు మోసం చేస్తే వారు మిమ్మల్ని మోసం చేయడానికి వెనుకాడారు.
ధనస్సు: ధనస్సు రాశివారు తమకు నచ్చింది చేసుకుంటూ పోతారు. భాగస్వామిని మోసం చేయడం వీరికి అతితేలిక.
మకర రాశి: ఈ రాశివారిని పెళ్లాడితే జీవితాంతం ఆనందంగా ఉండచ్చు. భాగస్వామి నచ్చకపోతే వేరే వ్యక్తితో బంధాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటారు.
కుంభం: భాగస్వామిని అర్థం చేసుకోకపోవడం లేదా ఆ ప్రేమని తిరిగి చూపించకపోయినా మరో వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
మీనరాశి: ఈ రాశివారు ప్రేమ కలిగి ఉంటారు. తమ భాగస్వామిని ప్రేమిస్తారు. భాగస్వామి నుంచి ప్రేమ దక్కకుంటే మరో జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు.