ఐటీఐఆర్ ప్రాజెక్టు మళ్లీ అగ్గి రాజేసిందా 

-

హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ రద్దు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాక పుట్టిస్తుంది.టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐటీఐఆర్ పై అన్ని ఆధారాలతోనే తాము మాట్లాడుతున్నామని, సీఎం కేసీఆర్‌ వాస్తవాలను గుర్తించాలన్నారు బండి సంజయ్. అయితే బండి సంజయ్‌ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలంటూ మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు.

హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ రద్దుపై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ కాక రేపుతోంది. తెలంగాణలో ఐటీఐఆర్‌ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. రోజుకో ఉత్తరం రాస్తూ, తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది. ఉద్దేశపూర్వకంగా సహాయనిరాకరణ చేసి, ప్రాజెక్టు ఆగిపోయేందుకు కారణమయ్యారన్నారు. రైల్వే,ఎంఎంటీఎస్, రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసినట్లైతే.. ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉండేదన్నారు.

దీనికి మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. హైదరాబాద్ ఐటీఐఆర్‌ను మూలనపెట్టింది బీజేపీనేనన్నారు . 2014 నుంచి రాసిన లేఖలు,రిపోర్టులు ..సంజయ్‌కిస్తామన్నారు. బీజేపీ మంత్రి చేసిన ప్రకటన తెలియకపోవడం.. సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. బెంగళూరుకు ఐటీఐఆర్ విషయంలో ఇలాగే హ్యాండిచ్చారన్నారు. ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ము సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించి కేటీఆర్.. బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్‌ వాస్తవాలను గుర్తించాలన్నారు బండి సంజయ్. ఐటీఐర్‌పై తాము పూర్తి వివరాలు అందించామని తెలిపారాయన. కేంద్రం ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన నివేదిక అని తెలిపారు. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నామని స్పష్టంచేశారు బండి సంజయ్. 2008లో ఐటీఐఆర్ ను రెండు ఫేజ్‌లలో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు టీఆర్ఎస్ నేతలు. తొలి విడలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసి 322 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉందని తెలిపారు.

మొత్తంమీద.. ఐటీఐఆర్ ప్రాజెక్టు వ్యవహారం ఇరు పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. పరస్పర విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో వేడి పుట్టిస్తున్నారు నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news