రాష్ట్రం దారి తప్పుతుంది..బాధేస్తోందన్న లోకేష్ !

-

విశాఖపట్నంలో పర్యటిస్తున్న నారా లోకేష్ విద్యార్థులతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ విశాఖకు ఐటీ పరంగా అనేక అవకాశాలు ఉన్నాయని ఇక్కడ కొత్త పరిశ్రమలు రావాల్సింది పోయి ఉన్న పరిశ్రమలు పోతున్నాయని అన్నారు. మాజీ ఐటీ శాఖ మంత్రిగా బాధ  ఉందని రాష్ట్రం దారి తప్పుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఓటు విశాఖ భవిష్యత్ ను నిర్ణయిస్తుందన్న ఆయన మేము అధికారంలో ఉండగా విశాఖలో లులూ తో కన్వెన్షన్ సెంటర్ కావాలన్నాము కానీ దాన్ని వెళ్లగొట్టారని అన్నారు.

టీడీపీ నేత నారా లోకేశ్

రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలు అతీతంగా ప్రయత్నం చెయ్యాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఇలాగే కొనసాగితే వడ్డీ కట్టలేని పరిస్థితి వస్తుందని విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంచారని ఇప్పుడు నష్టాలు వచ్చాయి అని చెబుతున్నారని అన్నారు. పక్కనే ఉన్న జింక్ మూసేసారు ఇప్పుడు కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. విశాఖలో ఆధాని డేటా సెంటర్ వచ్చి ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవని అలాంటిది జగన్ దెబ్బకు పారిశ్రామిక వేత్తలు మన రాష్ట్రం రావడానికి భయపడుతున్నారని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news