లాక్ డౌన్ లో 9 ఏళ్ళ పిల్లాడు ఏం చేసాడో చూడండి…!

-

కరోనా లాక్ డౌన్ వచ్చింది… మరి పిల్లలు ఏం చేస్తున్నారు…? చాలా మంది ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఆడుకోవడ౦, తినడం, పడుకోవడం లేవడం మళ్ళీ అదే. కాని ఒక 9 ఏళ్ళ పిల్లాడు మాత్రం ఒక సంచలనం చేసాడు. అందరూ ఇంట్లో ఉండి కరోనా మీద యుద్ధం చేస్తుంటే ఆ బాలుడు మాత్రం కీలక అడుగు వేసాడు. ఇటలీలో మార్చి 8 నుండి లాక్ డౌన్ ఉంది. అక్కడ కఠినం గా అమలు చేస్తున్నారు.

దీనితో మిలాన్ శివారుల్లో ఉండే ఒక 4వ తరగతి పిల్లాడు… తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి గానూ ఒక వీడియో గేమ్ క్రియేట్ చేసాడు. “COVID-19 కారణంగా నేను బయట ఆడుకునే ఆటలు ఆన్ని ఆపేశా… నేను నా కుక్కతో చెరువుకు కూడా వెళ్ళలేను. స్పోర్ట్స్ ఆడటానికి బదులుగా స్కీయింగ్, స్విమ్మింగ్ మరియు కరాటే చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు. ఇంతకి అతని పేరు ఏంటీ అంటే లూపో…

దీనితో అతను తన దృష్టి ప్రోగ్రామింగ్ వైపు మళ్లించడానికి ఉపయోగించాడు. కొన్ని ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ తీసుకున్నాడు. దీనితో సెర్బా -20 అనే గేమ్ ని నిర్మించాడు. ఆట లక్ష్యం లేజర్‌లతో వెతికి… కొన్ని స్థలాలను నాశనం చేయడం. ఇది అంతా అంతరిక్షంలోనే జరుగుతూ ఉంటుంది. తన స్నేహితులతో ఆడుకుంటున్న అని మరియు ఇప్పుడు వారికి ఎలా ప్రోగ్రామ్ చేయాలో నేర్పడానికి ఒక ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని లూపో వివరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news