ఒకపక్క కరోనా గురించి ప్రపంచం మొత్తం వణికిపోతుంటే… నాయకులు, అధికారులూ రకరకాలుగా కష్టపడుతూ.. కరోనాని కంట్రోల్ చేయడానికి చూస్తుంటే.. రోజుకి వందల కోట్ల ఆదాయాలని సైతం వదులుకుని, ప్రభుత్వాలు ప్రజారోగ్యం గురించి ఆలోచిస్తుంటే… ఈ జనాలకు ఏమాత్రం అది పట్టడం లేదు! గ్రామాల్లో ప్రజలు వారికి ఎవరూ చెప్పకుండానే… ఏ గ్రామనికి ఆ గ్రామం కంచెలు వేసుకుని మరీ జాగ్రత్తలు పాటిస్తుంటే… పట్టణాల్లో ప్రజలు మాత్రం భయం లేకుండా బరితెగించేస్తున్నారు!!
ప్రతీరోజూ ప్రతీమనిషికి బయట పని ఉంటాది అన్న విషయం అందరికీ తెలిసిందే. పప్పు కావాలనో, ఉప్పు కావాలనో, పిల్లలకు డైపర్లు కావాలనో, పిప్పరమెంటు బిల్లలు కావాలనో… కారణాలు అనేకం ఉండొచ్చు కానీ… నియంత్రణ ఇంకా ముఖ్యం కదా! తాజాగా హైదరాబ్ లో జనాలు చేసిన హడావిడి, ఏదో హాలిడేస్ లో బయటకు వచ్చినట్లు వచ్చిన తీరు, ఒకే బైక్ పై ఇద్దరేసి ప్రయాణించిన విధానం చూసినవారంతా… ముక్కున వేలేసుకుంటున్నారు! దేశమంతా మే 3 వరకూ అంటే… కాదు కాదు తీవ్రత ఎక్కువగా ఉండేలా ఉంది అని ముందుచూపుతో వ్యవహరించి మే 7 వరకూ లాక్ డౌన్ అంటూ ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది. ప్రభుత్వం కరోనా విషయంలో ఎంత భయపడుతుంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అనే విషయం చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు! ప్రభుత్వాలు అలా ఉంటే… అవి ఏవో రూల్స్ అంతే… మనం పాఠించాలని ఏమీ రూల్ లేదు.. అనుకుంటున్నారు హైదరాబాదీలు!
డీమార్ట్ లాంటి షాపింగ్ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి.. వస్తువులు కొనేందుకు జనం ఎగబడుతున్నారు. ఆ జనాలను చూస్తే మాత్రం… ఇవి సాధారణ రొజులా లేక లాక్ డౌన్ రోజులా అన్న తేడా కనిపించదు! భౌతిక దూరం నిబంధన అనే ఆలోచనలే లేదు! ఇలా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అటువంటి సూపర్ మార్కెట్లు, షాపింగ్ కేంద్రాలన్నీ ఇలానే కిటకిటలాడుతున్నాయి! రాష్ట్రమంతా రూల్స్ అమలు మాములుగా లేదు అని చెబుతున్న పోలీసులు ఈ విషయంలో మాత్రం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారో అర్ధం కావడం లేదు అంటున్నారు ఈ సన్నివేశాలు చూసినవారు!
పోలీసులు లాఠీలకు పనిచెబితేనే జనాలు వింటారు అని అనోవడం కూడా తప్పే కానీ… జనాలకు మాత్రం ఆ మాత్రం జ్ఞానం లేదా? పోలీసులు ఎంతమందిని మాత్రం చూసుకోగలరు! మనిషికోమాట గొడ్డుకో దెబ్బ అనే సామెతను గుర్తుకు తెచ్చుకునైనా జాగ్రత్తగా ఉండాలి కదా! దీనికి కారణం… జనాలకు కరోనా అంటే భయం లేక, లేక అవగాహనా లోపమా? సిగ్గు సిగ్గు… వాటిలో ఏదైనా కూడా అది దేశద్రోహమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!! జనాలు ఇలానే ప్రవర్తిస్తే మాత్రం… మే 3 కాస్తా.. డిసెంబరు 3 అయినా ఆశ్చర్యం లేదు అనే కామెంట్స్ కూడా బాగానే వినిపిస్తున్నాయి!!