పరశురామ జయంతి ప్రత్యేకం : రామాయణ భారతాలలో పరశురాముడు !

-

 పరశురామ అవతారం కేవలం ఒక యుగానికి పరిమితం కాకుండా నేటికి ఉందని పండితులు పేర్కొంటారు. త్రేతాయుగం, ద్వాపరయుగంలో రామయణం, భారత కాలంలో కూడా ఆయనతో ముడిపడి ఉన్న ఘట్టాలు తెలుసుకుందాం….


సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విషయం తెలిసిన పరశురాముడు తన గురువైన శివుడి విల్లు విరిచినందుకు కోపంతో రాముడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరథుడు చేసిన అభ్యర్థనలను కానీ, శ్రీరాముని శాంత వచనాలను కానీ పట్టించుకోకుండా చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రాముడికి ఇచ్చాడు. రాముడు దాన్ని కూడా అవలీలగా ఎక్కుపెట్టాడు. శ్రీరాముడు తాను ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు వదలాలి అని పరశురాముడిని అడిగగా తన తపోశక్తిని కొట్టేయమని చెప్పి తిరిగి మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.

 

భారతంలో పరశురాముడి అనుబంధం

పరశురాముడు మహాభారతంలో ముగ్గురు వీరులకు గురువయ్యాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్ముడికి అస్త్రశస్త్ర విద్యలు బోధించాడు. అంబికను వివాహం చేసుకోమని పరశురాముడు కోరగా, భీష్ముడు తాను ఆజన్మ బ్రహ్మచర్యవ్రతుడు అయినందుకు నిరాకరించాడు. దీంతో కోపగించిన పరశురాముడు భీష్ముడితో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరూ సరిసమానంగా యుద్ధం చేస్తుండటంతో దేవతలు యుద్ధం ఆపమని అభ్యర్థించగా యుద్ధాన్ని నిలిపివేశారు.

కర్ణుడు తాను బ్రాహ్మణుడిని అసత్యం పలికి పరశురాముడి దగ్గర శిష్యునిగా చేరి అస్త్ర విద్యలు నేర్చుకుంటున్న సమయంలో నిజం తెలిసిన పరశురాముడు యుద్ధకాలంలో తెలిసిన విద్యలు గుర్తుకు రావు అని కర్ణుడిని శపించాడు. ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా పరశురాముడిని దర్శించుకున్నాడు. పరశురాముడు దత్తాత్రేయుడి దగ్గర శిష్యుడిగా చేరి అనేక విద్యలు నేర్చుకున్నాడని స్కాంద పురాణంలో వివరించబడింది. ఒకసారి పరశురాముడు తన గురువైన పరమేశ్వరుడి దర్శనార్థం కైలాసంలో ద్వారం దగ్గర వినాయకుడు అడ్డగించాడు. పరశురాముడు కోపంతో తన పరశువు విసిరాడు. తన తండ్రి అయిన శివుడి ప్రసాదం అయిన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగే విరిచేసుకున్నాడు.

పరశురామ జయంతినాడు ఇలా చేయాలి !

పరశురామ జయంతి రోజున ఉపవాసం చేసి, పరశురాముడిని షోడశోపచారాలతో పూజించి,
‘జమదగ్ని సుత ! వీర ! క్షత్రియాంతక ప్రభో !
గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర !’ అని అర్ఘ్య ప్రధానం చేయాలి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news