ఇంట్లో కొన్ని చిన్న చిన్న విషయాలను మనం తెలియక పెద్దగా పట్టించుకోం. అలానే వదిలేస్తాం. వాటి ప్లేస్‌లో కొత్తది తెచ్చుకుంటాం. ఈరోజు కొన్ని చిన్న టెక్నిక్స్ తెలుసుకుందాం. మీరు కూడా ఇవి తెలియక ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడే ఉంటారు.
కత్తెర అంచు తరచుగా పదును కోల్పోయినట్టు అయిపోతుంది. దీన్ని మళ్ళీ చక్కగా చేయడానికి సిల్వర్ పేపర్ మార్కెట్లో దొరుకుతుంది. సిల్వర్ పేపర్ ను మడతలుగా మడిచి.. దానిని కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. అంతే.. వెంటనే మీ కత్తెర పదునుగా తాయారు అవుతుంది.
వర్షాకాలంలోనూ.. శీతాకాలంలోనూ గది నుంచి దుర్వాసన రావడం సహజం. మీరు గదిని సువాసన భరితంగా చేయాలనుకుంటే, నారింజ కొవ్వొత్తిని వెలిగించండి. ఇది తయారు చేయడం చాలా సులభం. నారింజను మధ్యకు కోయండి .. దాని పై తొక్కను రెండు గిన్నెలులా ఏర్పడే విధంగా లోపలి తొనలను తొలగించండి. ఇప్పుడు ఆ నారింజ దొప్పలలో నూనె లేదా మైనం వేసి వత్తిని ఉంచి కాల్చండి. గది తాజా వాసన వస్తుంది.
బూట్లు దుర్వాసన వస్తుంటే.. వాటి లోపల టీ-బ్యాగ్‌లను ఉంచండి. వాటిని అలానే రాత్రిపూట వదిలివేయండి. అంతే వాసన పోతుంది. లేదంటే బేకింగ్ సోడా కూడా వేసి ఉంచుకోవచ్చు. సోడాను ఒక గుడ్డ సంచిలో నింపి దానిని అలానే షూస్ లో పెట్టేయండి. ఉదయానికి మళ్ళీ ఫ్రెష్ గా సిద్ధం అయిపోతాయి.
ఇనుప కత్తులు, కత్తెరలు వాడకపోవడం వల్ల తుప్పు పట్టేస్తాయి. మళ్ళీ ఎప్పుడన్నా వాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, తరిగిన ఉల్లిపాయలను వాటిపై రుద్దండి. కాసేపు రుద్దితే తుప్పు పోతుంది. తర్వాత నీటితో కడగాలి.
ఫర్నిచర్ నుంచి గీతలు తొలగించడానికి, ఒక భాగం వెనిగర్‌ను రెండు భాగాల కనోలా నూనెతో కలపండి. ఆయిల్ మిశ్రమంలో గుడ్డను ముంచి ఫర్నిచర్ మీద అప్లై చేయండి. ఫర్నిచర్ షైన్ తిరిగి వస్తుంది .. గుర్తులు పోతాయి.
బాత్రూంలో అద్దం మీద తరచుగా పొగమంచు ఉంటుంది. టూత్‌పేస్ట్ లేదా షేవింగ్ ఫాగ్‌తో రుద్దండి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. గాజు మెరుస్తుంది.
ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయ్ కదా..మీ ఆత్మీయులకు కూడా షేర్ చేయండి.
-Triveni Buskarowthu