స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించేవారు ఈ తప్పులని చెయ్యద్దు…ఆరోగ్యానికి కూడా ముప్పే..!

-

ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ ని మనం ఎక్కువగా వాడుతున్నాము. స్మార్ట్ ఫోన్ వల్ల పనులు సులభంగా అవుతాయి. అలానే స్మార్ట్ ఫోన్ వల్ల సమయం కూడా తెలియకుండా పోతుంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించడం వల్ల ఐ ఇరిటేషన్, నిద్రలేమి సమస్యలు వస్తాయి.

స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది స్మార్ట్ ఫోన్ ని రాత్రి చార్జింగ్ పెట్టి నిద్ర పోతూ ఉంటారు. అయితే ఈ అలవాటు ఉండడం చాలా ప్రమాదం అని అంటున్నారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది ఇది మానుకోవడం మంచిది. రాత్రంతా ఛార్జింగ్ లో ఫోన్ పెట్టేసి నిద్ర పోవడం వల్ల ఫోన్ పాడవుతుంది.

అలానే మీరు మంచం మీద ఛార్జింగ్ పెట్టడం వల్ల మీ స్కిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మొబైల్ బ్యాటరీ కూడా చెడిపోతుంది. కొన్ని కొన్ని సార్లు ఫుల్ గా చార్జింగ్ పెట్టడం వల్ల బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనితో ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది. అలానే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఒత్తిడి కలుగుతుంది.

చాలా మంది స్మార్ట్ ఫోన్ ని బాత్రూంలోకి కూడా తీసుకుని వెళ్ళి పోతూ ఉంటారు. ఇలా అలవాటు ఉన్న వాళ్ళకి డిప్రెషన్ పెరుగుతుంది. బాత్రూంలో ఫోన్ ఉపయోగించడం వల్ల మైండ్ కి ఎఫెక్ట్ అవుతుంది. అలానే ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్ళు ఈ తప్పులు చేయకుండా ఉండండి లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news