పామును మెడ‌లో వేసుకుని మహిళా జర్నలిస్టు రిపోర్టింగ్: వైరల్ అవుతున్న వీడియో

-

పామును చూస్తేనే చాలా మందికి భయమేస్తుంది. మనకు దగ్గరగా కనిపిస్తే భయంతో పరుగులు పెడతాం. అలాంటిది పాములను పట్టుకోవడం అంటే ఇంకేముంది ఒంట్లో వణుకు పడుతుంది. ఇక మ‌రికొంద‌రు త‌మ‌ను ఎక్క‌డ కాటేస్తుందా అని వాటిని ముందుగానే చంపేస్తుంటారు. ఇదిలా ఉంటే.. పాముల భద్రత, విష సర్పాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ ఓ మహిళా జర్నలిస్టు ఓ ప్రోగ్రాంలో పాల్గొంది. ఇందులో భాగంగా తన మెడలో పామును వేసుకుంది. ఆ సమయంలో పాము బుసలు కొట్టడంతో ఆమె భయంతో గజ గజా వణికిపోయింది.. మూడు సార్లు ఇలా జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియోను స్కై న్యూస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా జర్నలిస్టు పట్టుకున్న మైకుపై ఆ పాము కాటు వేసినంత పని చేసింది. ‘మైకు దగ్గరలోనే నా చేతి ఉంది. దీంతో నేను చాలా భయపడి పోయాను’ అని ఛానల్ 9 మహిళా జర్నలిస్టు తెలిపింది. ఒక వేళ ఆ పాము తన చేతిపై కాటు వేస్తే ఏం జరిగి ఉండేది? అని ఆమె ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news