కేంద్రం సంచలన నిర్ణయం, ఆ యాడ్స్ చేస్తే జైలే…!

-

ఇది వాడితే రంగు మారతారు… ఇది వాడితే పిల్లలు పుడతారు. అది వాడండి ఇది వాడండి అంటూ ప్రచారాలు చేస్తూ ఉంటారు. దీనిని నమ్మి ఎందరో కొనుగోలు చేసి మోసపోతూ ఉంటారు. చాలా వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. డబ్బు పోయే శనీ పట్టే అన్నట్టు చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అనారోగ్యాల బారిన పడుతూ ప్రమాదకర వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.

ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చెత్త యాడ్ లను చెక్కే పెట్టే నిర్ణయం తీసుకునే విధంగా చట్టంలో మార్పులు చేసింది. ఇక నుంచి ఈ విధమైన అసత్య ప్రకటనలు చేసిన కంపెనీ నిర్వాహకులు, బాధ్యులకు 5 ఏళ్ల జైలు శిక్షతోపాటూ… రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ… డ్రగ్స్ అండ్ మేజిక్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్‌మెంట్స్ యాక్ట్ 1954) (Objectionable Advertisements Act, 1954) చట్టంలో మార్పులు చేసింది.

ఇలాంటి యాడ్స్ చేయించే కాస్మొటిక్ కంపెనీలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం కోసం ఏ ప్రకటన పడితే అది ఇస్తే ఇబ్బంది అవుతుంది. ఈ డ్రాఫ్ట్ బిల్లులో కొన్ని అదనపు అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేర్చింది. అవి వాడిన వినియోగదారులకు వ్యాధులు వస్తే మాత్రం సదరు కంపెనీలు జరిమానా చెల్లించాలి. మొత్తం 78 రకాల వ్యాధులు, సమస్యల్ని చట్టంలో చేర్చారు.

టీవీ ప్రకటనల్లో సెక్సువల్ పెర్ఫార్మెన్స్, స్కిన్ టోన్, ప్రీమెచ్యూర్ ఏజింగ్, ఎయిడ్స్, జుట్టు తెల్లబడుట, మహిళల్లో సంతాన ప్రాప్తి అంశాలకు సంబంధించిన యాడ్స్ విషయంలో ఇక నుంచి కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుంది. మొదటి పనిష్మెంట్ కింద, ఆరు నెలల వరకూ జైలు శిక్ష లేదా జరిమానా. ఆ తర్వాత కూడా తప్పు చేస్తే మాత్రం ఏడాది జైలు లేదా ఫైన్ లేదా రెండూ విధించేవారు.

కొత్త ప్రతిపాదనల ప్రకారం, మొదటిసారి తప్పు చేస్తే, రెండేళ్ల జైలుతోపాటూ… రూ.10 లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. రెండోసారి తప్పు చేస్తే., ఐదేళ్ల జైలు, రూ.50 లక్షల ఫైన్ విధిస్తారు. ఈ కొత్త ప్రతిపాదనలపై ప్రజలు, సంస్థల అభిప్రాయాల్ని త్వరలో కేంద్ర ప్రభుత్వం కోరనుంది. నోటీస్ ఇచ్చిన 45 రోజుల్లో అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది.

ఈ యాడ్లు కేవలం టీవీల్లో వచ్చేవి మాత్రమే కాకుండా, ఆడియో, వీడియో, రిప్రజెంటేషన్, ప్రొనౌన్స్‌మెంట్, ఎండార్స్‌మెంట్…. లైట్, సౌండ్, స్మోక్, గ్యాస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్, వెబ్‌సైట్ ఇలా ఎందులో వచ్చినా చట్ట రీత్యా నేరమే అవుతుంది. ఊహాతీతమైన, వాస్తవ విరుద్ధమైన యాడ్లపైనే ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news