మంచు గుడ్లగూబ సందడి.. ఎక్కడో తెలుసా..!

Join Our Community
follow manalokam on social media

మంచు గుడ్లగూబలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అసలు ఉన్నాయో.. లేవో.. తెలియని పరిస్థితి. 130 ఏళ్ల కిందట అమెరికాలో కనిపించిన మంచు గుడ్లగూబ మళ్లీ అక్కడి పార్కులో దర్శనమిచ్చింది. దీంతో గుడ్లగూబను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఆ పక్షితో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరుదైన జాతి గుడ్లగూబ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అవి చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

owl
owl

న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ జూ పార్కులో అరుదైన జాతికి చెందిన గుడ్లగూబ సందడి చేస్తోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ గుడ్లగూబ కనిపించడంతో పక్షి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1890 సంవత్సరంలో మంచు గుడ్లగూబలు అమెరికాలోని సెంట్రల్ పార్కులో ఎక్కువగా కనిపించేవి. రానురాను వాటి సంఖ్య కనుమరుగయ్యాయని అమెరికా నేచురల్ హిస్టరీ మ్యూజియం పక్షి శాస్త్ర విభాగం కలెక్షన్ మేనేజర్ పాల్ స్వీట్ తెలిపారు.

మంచు గుడ్లగూబలు ఆర్కిటిక్ ప్రాంతంలోని టండ్రాల్లో నివసిస్తుంటాయి. శీతాకాలంలో మాత్రం దక్షిణ దిశగా ప్రయాణిస్తాయని పాల్ స్వీట్ వెల్లడించారు. ఈ మేరకు పార్కుకి వచ్చిన మంచు గుడ్లగూబను చూసి పర్యాటకులు పోటెత్తుతున్నారు. గుడ్లగూబ భయాందోళనకు గురవుతుందని, పక్షిని చూడాలనుకునేవారు తప్పనిసరిగా బైనాక్యులర్ ఉపయోగించాలని జూ పార్కు అధికారులు సూచిస్తున్నారు.

మంచి గుడ్లగూబకు సంబంధించిన వీడియోను మన్హటన్ బర్డ్ అలర్ట్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్టు చేశారు. ‘‘సెంట్రల్ పార్కు నార్త్ మెడో ప్రాంతంలో మంచు గుడ్లగూబ కనిపించింది. ఈ పక్షిని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. ఫెన్సింగ్‌కి దూరంగా ఉంటూ.. అల్లరి చేయకుండా పర్యాటకులు పక్షిని చూసేందుకు వస్తున్నారు.’’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. మంచు గుడ్లగూబ ఎంత అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా పార్కుకి వెళ్లి మంచు గుడ్లగూబను చూసి రావాలని చెబుతున్నారు.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...