వారానికి నాలుగు రోజుల పని ట్రయల్ చూడబోతున్న స్పెయిన్.. అంతకుముందే ఎవరు ట్రై చేసారో తెలుసా..?

-

ఉద్యోగుల పనిదినాల గురించి గత కొన్ని రోజులుగా పెద్ద చర్చే నడుస్తుంది. ప్రస్తుతం వారానికి ఐదు రోజులు పనిచేస్తుంటే, దాన్ని తగ్గించి వారానికి నాలుగు రోజుల పాటే పనిచేయించాలని, దాని కోసం చట్టం తేవాలన్న డిమాండ్ కూడా నడుస్తుంది. పని- జీవితం మధ్య బ్యాలన్సింగ్ కుదరడానికి ఇలాంటి కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి. పని ఒత్తిడి నుండి తప్పించుకుని ఎక్కువ మొత్తంలో నాణ్యత గలిగిన పని చేయడానికి ఈ విధానం పనిచేస్తుందని, కాబట్టి నాలుగు రోజుల పని విధానం మంచిదని చెబుతున్నారు.

తాజాగా స్పెయిన్ ఈ విధానాన్ని ట్రయల్ చేసి చూడాలనుకుంటుంది. అక్కడ కంపెనీలు తమ ఉద్యోగస్థులకి నాలుగు రోజుల పని దినాలని ఆఫర్ చేయవచ్చునని, దీని ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుందో చూడాలనుకుంటున్నామని తెలిపింది. కేవలం నాలుగు రోజులే పని ఉండడం వల్ల మిగతా వేళల్లో ఆఫీసు ఖర్చులు మిగులుతాయని, అదే గాక నాలుగు రోజుల్లో ఉద్యోగస్తుల మీద పెద్దగా ప్రభావం పడదు గనక నాణ్యమైన పని జరుగుతుందని అంటున్నారు.

ఐతే ఈ నాలుగు రోజుల పని విధానం ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు. గతంలో కొన్ని దేశాలు ఆల్రెడీ ఈ విధానాన్ని అవలంబించాయి. 2008లో ఉతాహ్ దేశం ఈ విధానాన్ని ప్రారంభించింది. కానీ 2011లో మళ్ళీ పాత పద్దతైన ఐదు రోజుల పని విధానానికి వచ్చేసింది. 2020లో న్యూజిలాండ్ మినిస్టర్ జేసిండా చెప్పిన దాని ప్రకారం నాలుగు రోజుల పని విధానంలో పని- జీవితం మధ్య సమతుల్యం ఏర్పడి ప్రోడక్టివిటీ పెరుగుతుందని, దానివల్ల పనులు వేగవంతం అవుతాయని తెలిపింది.

జర్మనీ, ఫిన్లాండ్ దేశాలు కూడా ఈ నాలుగు రోజుల పని విధానాన్ని పరీక్షించాయి. మన దేశంలోనూ ఈ విషయమై ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ నాలుగు రోజుల పని విధానానికి అనుకూలంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news