సెల్‌ఫోన్‌ చూస్తూ నడిచేవారికి ప్రత్యేక రోడ్డు.. ఎక్క‌డో తెలుసా

-

సెల్ ఫోన్ మాట్లాడుతూ లేదా చూస్తూ నడిచే వాళ్ళని చాలామంది మన రోడ్డుమీద చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది రోడ్డు మీద నడుస్తూ కూడా తల దించుకొని ఫోన్‌కే ప‌రిమితం అవుతుంటారు. స్మార్ట్‌ఫోన్‌లో తలదూరిస్తే కొందరు లోకాన్నే మరిచిపోతారు. ఇలా నడవడం ఎంతో ప్రమాదకరమని తెలిసినా దీన్ని వ‌ద‌ల‌రు. అయితే బ్రిటన్‌లోనైతే ఈ బాపతు జనాలు 75శాతం దాకా ఉంటారట. ఈ క్ర‌మంలోనే సెల్‌ఫోన్‌లో చూస్తూ.. ప్రపంచాన్ని మరిచి నడిచేవారి కోసం ఓ ప‌రిష్కారం వెతికారు.

ఇలాంటి వారిలో మార్పును ఆశించే బదులు వారి దారిలోనే పరిష్కారం ఆలోచిస్తే పోలా? అని అనుకున్నారో ఏమో.. వారి కోసం ప్రత్యేకంగా ఓ రోడ్డునే వేశారు అక్కడి అధికారులు. మాంచెస్టర్‌లోని ఓ రద్దీ ప్లేస్‌లో మొబైల్‌ పాదచారుల కోసం ‘మొబైల్‌ ఫోన్‌ సేఫ్‌ లేన్స్‌’ పేరుతో 75 మీటర్ల పొడవైన రోడ్డును వేశారు. రోడ్డు మీద అటూఇటూ నడిచేవారి కోసం వేర్వేరు గీతలు ఉంటాయి. ఈ రోడ్డుతోనైనా మనుషులు ఒకరినొకరు తాకకుండా, ప్రమాదాలకు గురవకుండా నడుస్తారని అధికారులు భావిస్తున్నారు. వాస్త‌వానికి ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో ఇలాంటి నడక దారుల వల్ల చాలా ఉపయోగకరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version