యుక్త వయస్సులో వీటిని పాటిస్తే విజయం తప్పక మీదే…!

ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. వాటిని చేరుకోవాలని మనిషి కృషి చేస్తూ ఉంటారు. కానీ అందరూ అనుకున్నవి సాధించలేరు. కొంతమంది మాత్రమే అనుకున్నవి చేయగలరు. చాలామంది విఫలం అవుతూ ఉంటారు. అయితే అలా విఫలం అవ్వకుండా ఎలా మనం గెలవాలి అనేదాని గురించి చాణిక్యనీతి చెబుతోంది. చాణక్య నీతి ప్రకారం జీవితంలో గెలవాలి అంటే యవ్వనంలోనే వీటిని అలవర్చుకోవాలి అని అంటున్నారు.

 

నిజంగా ప్రతి ఒక్కరూ వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా అనుకున్నది సాధించ వచ్చు. సాధారణంగా యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఎక్కువగా చెడుకి ఆకర్షితులవుతారు. చెడు అలవాట్లని అలవాటు చేసుకోవడం లాంటివి. అలాంటివి అలవాటు అవ్వకుండా ఉండాలంటే ఇవి తప్పక ఉండాలి అనే చాణక్య అంటున్నారు.

ఆత్మవిశ్వాసం:

ప్రతి ఒక్కరికి కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉంటే దేనినైనా చేరుకోగలం కాబట్టి యుక్త వయసులో వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలి.

క్రమశిక్షణ:

క్రమశిక్షణ అనేది నిజంగా యవ్వనదశలో తప్పనిసరిగా ఉండాలి. క్రమశిక్షణ ఉంటే అనుకున్న పనులు సకాలంలో చేయొచ్చు అదేవిధంగా వ్యసనాల బారిన పడకుండా యవ్వన దశలో ఉంటే జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది.

అంతేకానీ వ్యసనాలకు బానిస అయి యవ్వన దశలో చెడ్డ మార్గంలో వెళితే జీవితం కూడా అలానే ఉంటుంది. అందుకని మంచి అలవాట్లను యుక్తవయసులో అలవాటు చేసుకుని దాని ప్రకారం నడుచుకుంటే తప్పకుండా అనుకున్నది సాధించ వచ్చు.