పుట్టిన రోజున కూడా జగన్ నిజం మాట్లాడలేదు : అచ్చెన్నాయుడు

జగన్ తన పుట్టిన రోజున పేదల రక్తాన్ని పీల్చే కార్యక్రమం ప్రారంభించారని.. సీఎం జగన్ నోటి వెంట అమ్మడం అనే పేరు తప్ప ఇంకో మాట రావడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పుట్టిన రోజున కూడా జగన్ నిజం మాట్లాడలేదని.. మండిప‌డ్డారు. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు హయాం వరకు ఇచ్చిన ఇళ్లపై జగన్ ఇప్పుడు భారం మోపుతున్నారని.. సీఎం జగన్ తన పుట్టిన రోజు OTS అనే ఒక దుర్మార్గమైన కార్యక్రమం మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు.

అసలు OTSపై సీఎం జగనుకేం హక్కు ఉందని.. 5 ఏళ్లలో 32 లక్షల ఇళ్ళు కడతాం అని చెప్పిన జగన్.. 30 నెలల్లో జగన్ ఒక్క ఇల్లు ఐన కట్టారా..? అని నిల‌దీశారు. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో 7.52 లక్షల ఇళ్ళు కట్టింది వాస్తవం కాదా..? అని ప్ర‌శ్నించారు. జగన్ ఇచ్చే ఇంటి పట్టా చెల్లుబాటు కాదని… 5 వేల కోట్ల దోపిడీ కోసమే OTS కార్యక్రమమ‌ని వెల్ల‌డించారు. పేదల ఇళ్లకు 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమ‌ని… ఇప్పటికి కేవలం 5.43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఉపయోగించారని పేర్కొన్నారు. ఎప్పుడు 32 లక్షల ఇళ్లు కడతారు..? ఎలా కడతారు..? అని అచ్చెన్నాయుడు నిల‌దీశారు.