ఏపి జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జీఏడి సర్వీసెస్ కార్యదర్శిని శశిభూణన్ను కలిశామని.. రేపు శాఖా కార్యదర్శులు సమావేశం సిఎస్ నిర్వహిస్తున్నారన్నారు. రేపు సాయంత్రం సిఎస్ నేతృత్వంలో పీఆర్సీపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉందని… ఇవాళ సీఎం జగన్ పుట్టిన రోజు పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఆశించాం.. రాకపోవడంతో నిరాశ చెందామని.. ఆయన పుట్టిన రోజుపై అసహనం వ్యక్తం చేశారు బండి శ్రీనివాస్.
సీఎం జగన్ పుట్టిన రోజునే మాకు నిరాశే కలిగిందన్నారు. 27 శాతం కంటే ఎక్కువగా ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎం చెప్పినట్లు సజ్జల చెప్పారని.. సీఎం జగన్ పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. తెలంగాణా కంటే మెరు గ్గా పీఆర్సీ ఉంటుందని ఆశిస్తున్నామని.. వెల్లడించారు. ఏపి జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లా డుతూ… రేపు సీఎస్ నిర్వహించే సమావేశంలో మా 71 డిమాండ్లపై చర్చించాలని కోరామని.. రేపటి సమావేశంలో ఉద్యోగులకు బకాయిపడ్డ రూ. 1600 కోట్లు విడుదల చేయాలని కోరామని చెప్పారు.