నిరుద్యోగులకు శుభవార్త.. 50 వేలకు మించి ఉద్యోగాలు

-

ప్రస్తుతం టీసీఎస్ కంపెనీలో 4,24,285 మంది ఉద్యోగులు ఉండగా.. ఇన్ఫోసిస్‌లో 2,28,123 మంది ఉద్యోగులు ఉన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు కంపెనీలు కలిసి 11 వేల మందిని మాత్రమే నియమించుకోగా.. ఈసారి 2018-19లో 50 వేల మందిని నియమించుకున్నారు.

ఐటీ దిగ్గజ సంస్థలు టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), ఇన్ఫోసిస్ కంపెనీలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50 వేల మందిని నియమించుకున్నాయట.

టీసీఎస్ కంపెనీ 29,287 మందిని, ఇన్ఫోసిస్ 24,016 మందిని నియమించుకున్నదట. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మందిని నియమించుకోవడానికి రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయట. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు ఇది శుభవార్తే.అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు ఉండటం, కొత్త ప్రాజెక్టులు కూడా ఎక్కువగా వస్తుండటంతో ఈ కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.ప్రస్తుతం టీసీఎస్ కంపెనీలో 4,24,285 మంది ఉద్యోగులు ఉండగా.. ఇన్ఫోసిస్‌లో 2,28,123 మంది ఉద్యోగులు ఉన్నారు.



2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు కంపెనీలు కలిసి 11 వేల మందిని మాత్రమే నియమించుకోగా.. ఈసారి 2018-19లో 50 వేల మందిని.. 19-20 ఆర్థిక సంవత్సరంలో 50 వేలకు మించి నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సో.. ఈ కంపెనీల్లో జాబ్ కొట్టాలంటే.. ఇన్న నాలెడ్జ్‌ను ఇంకాస్త మెరుగు పరుచుకొని… సంబంధిత సబ్జెక్ట్ పై పట్టు సాధించాలి. దీంతో మీ డ్రీమ్ జాబ్‌ను ఈ కంపెనీలో చేసే అవకాశం మీకే రావచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version