లైలా మజ్నూలను మించిన ప్రేమ వాళ్లిద్దరిది.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ

-

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఓవైసీ.. బీహార్‌లోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్కడ జరిగిన ర్యాలీలు, బహిరంగ సభలో పాల్గొన్నారు.

హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను లైలా మజ్నూలతో పోల్చారు. వారిద్దరిదీ లైలా మజ్నూలను మించిన ప్రేమ అంటూ ఎద్దేవా చేశారు. మోదీ, నితీశ్.. ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారన్నారు. అయితే.. వారిలో లైలా ఎవరు.. మజ్నూ ఎవరు అనే విషయం మాత్రం తనను అడగొద్దని.. ప్రజలే నిర్ధారించుకోవాలని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఓవైసీ.. బీహార్‌లోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్కడ జరిగిన ర్యాలీలు, బహిరంగ సభలో పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తర్ ఉల్ రెహమాన్.. పోటీ చేస్తున్న కిషన్ గంజ్ లోక్ సభ స్థానంలో ఆయనకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభల్లో ఓవైసీ పాల్గొని పైవిధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జేడీయూ పొత్తుపై మండిపడ్డారు.

మోదీ, నితీశ్ జోడి హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెడుతోంది..

మోదీ, నితీశ్ కుమార్‌ల జోడి హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెడుతోందని ఓవైసీ ఆరోపించారు. ఓవైపు బీజేపీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటూనే మరో వైపు ముస్లింలను దగా చేస్తోందని విమర్శించారు. ముస్లింలు తనకు ఓటేయకపోతే ఎవ్వరికీ ఉద్యోగాలు రావంటూ ఇటీవల కేంద్రమంత్రి మేనకా గాంధీ తన ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఓవైసీ గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version